T-Rex Skeleton: వేలానికి సిద్దమైన భారీ డైనోసార్‌ అస్థిపంజరం.. ఎప్పుడు..? ఎక్కడంటే..?

డైనోసార్స్ పైన చాలా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మిలియన్ ఇయర్స్ క్రితం ఈ భయంకర జీవులు భూమిపై నివసించేవి. ఇప్పటికీ వాటి ఆనవాళ్ల కోసం చాలా మంది పురావస్తు శాఖకు చెందిన పరిశోధకులు వెతుకుతూ ఉంటారు.

T-Rex Skeleton: వేలానికి సిద్దమైన భారీ డైనోసార్‌ అస్థిపంజరం.. ఎప్పుడు..? ఎక్కడంటే..?
T Rex Skeleton
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 01, 2022 | 7:26 AM

డైనోసార్స్ పైన చాలా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మిలియన్ ఇయర్స్ క్రితం ఈ భయంకర జీవులు భూమిపై నివసించేవి. ఇప్పటికీ వాటి ఆనవాళ్ల కోసం చాలా మంది పురావస్తు శాఖకు చెందిన పరిశోధకులు వెతుకుతూ ఉంటారు. ఇప్పటికే డైనోసార్స్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను కనుగొన్నారు. ఇదిలా ఉంటే తొలిసారి ఆసియాలో 43 అడుగుల పొడవు 16 అడుగుల ఎత్తు ఉన్న టీ రెక్స్‌ను వేలం వేయనున్నారు. 6.8 కోట్ల ఏళ్ల క్రితం జీవించిన ఈ టీ రెక్స్‌ అస్థిపంజరం ఉత్తర అమెరికాలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటివరకూ వచ్చిన డైనోసార్‌ సినిమాలన్నిటికీ ఇన్‌స్పిరేషన్‌ ఈ టీ రెక్స్‌. దీని తర్వాతే మరేదైనా.. అలాంటి టీ రెక్స్‌ను సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు దక్కింది.

దీని పేరు షెన్‌. నవంబర్‌ 30న హాంకాంగ్‌లో దీన్ని వేలం వేస్తున్నారు. కొనాలన్న ఆసక్తి ఉంటే మాత్రం ఓ 200 కోట్లు రెడీ చేసుకోండి. ఎందుకంటే.. ఈ అస్థిపంజరం ఆ మాత్రం ధర పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. విషయం అర్థమైందిగా..ఈ అస్థిపంజరం కొనాలంటే.. మన ఆస్తులు అమ్మితే సరిపోదు.. ఇరుగు పొరుగు, బంధుమిత్రుల ఆస్తులు కూడా అమ్ముకొని.. రంగంలోకి దిగాలన్నమాట. మరి రెడీనా..?

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం. ..ఇక్కడ క్లిక్ చేయండి