Tollywood: మొన్న చిరంజీవి.. ఇప్పుడు నాగర్జున.. పాలిటిక్స్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తోన్న టాప్ హీరోస్..
"ద ఘోస్ట్" ట్రైలర్ లాంచ్‌లో నాగార్జున పొలిటికల్ కామెంట్స్ చేశారు. 15ఏళ్లుగా నాపై రాజకీయ కథనాలు వస్తున్నాయ్ అంటూ తేల్చేశారు. నేను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ, మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్‌గా నటిస్తానంటూ..
పొలిటికల్ కామెంట్స్‌తో హీట్ పెంచేస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరోస్. రాజకీయాలకు దూరం అంటూనే పొలిటికల్ కామెంట్స్‌తో కాకరేపుతున్నారు. గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పొలిటికల్ డైలాగ్స్‌తో చిరంజీవి ప్రకంపనలు రేపితే… లేటెస్ట్‌గా “ద ఘోస్ట్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నాగార్జున రాజకీయాలపై మాట్లాడారు. కొద్దిరోజులుగా తనపై జరుగుతోన్న ప్రచారాన్ని ఒకే ఒక్క మాటతో కొట్టిపారేశారు. నో పాలిటిక్స్-నో ఇంట్రెస్ట్ అంటూ తేల్చేశారు.
రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారాన్ని నాగార్జున ఖండించారు. రీల్ లైఫ్‌లో పొలిటికల్ లీడర్‌గా ఓకే, కానీ రియల్ లైఫ్‌లో మాత్రం నో అనేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో అస్సలు నిజం లేదన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారి తనపై ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉందన్నారు.
15ఏళ్లుగా ఏదో ఒక పార్టీకి లింక్ పెట్టి తనపై కథనాలు రాస్తూనే ఉన్నారంటూ సింపుల్‌గా తేల్చేశారు. రియల్ లైఫ్‌లో పాలిటిక్స్‌కి నో చెప్పిన నాగార్జున.. మంచి కథ దొరికితే మాత్రం పొలిటికల్ లీడర్‌గా నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..