Pawan Kalyan: పవన్ తాజా ఫోటోలు, వర్క్‌షాప్ వీడియో చూశారా..? జూలు విదిల్చిన సింహంలా ఉన్నాడుగా

పవన్ పొలిటికల్ మోడ్ నుంచి మళ్లీ మూవీ మోడ్‌లోకి వచ్చారు. తాజాగా విడుదల చేసిన ఫోటోలలో కళ్యాణ్ బాబు సింహంలా ఉన్నాయి. ఈ ఫోటోలు ఆయన ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Pawan Kalyan: పవన్ తాజా ఫోటోలు, వర్క్‌షాప్ వీడియో చూశారా..? జూలు విదిల్చిన సింహంలా ఉన్నాడుగా
Pawan Kalyan
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 30, 2022 | 9:48 PM

పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా.. లేదంటే నిర్మాతలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా..? ఈ విషయం తెలియక చాలా మంది దర్శకులు తామే కన్ఫ్యూజన్‌లోకి వెళ్లిపోతున్నారు. వీటన్నింటికీ క్లారిటీ రావాలంటే పవన్ క్లారిటీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే తాజాగా ఆయన లుక్ మారింది.. పొలిటికల్ ట్రిప్పు మారింది. పైగా తాజా ఫోటోలు చాలా అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ ఏంటా ఫోటోలు.. వాటిలో ఏముంది..? మళ్లీ పాత కథే.. పవన్ ఎప్పుడెప్పుడు షూటింగ్స్ వైపు వస్తారా కోట్ల బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు.. కథలు రాసుకున్న దర్శకులు.. సినిమాల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఎప్పుడు పొలిటికల్ మూడ్‌లో ఉంటారో.. ఎప్పుడు లుక్ మార్చి సినిమాల్లోకి వస్తారో అర్థం కావట్లేదు. కొన్ని రోజుల కింది వరకు జనంలోనే ఉన్న జనసేనాని మనసు ఇప్పుడు సినిమాల వైపు మళ్లింది. దానికోసం గెటప్ కూడా మార్చేసారు ఈయన.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లుతో పాటు భవదీయుడు భగత్‌సింగ్, సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా, సముద్రఖని వినోదీయ సితం రీమేక్స్‌కు కమిటయ్యారు. సురేందర్ రెడ్డి సినిమా ఉన్నా.. ఇప్పట్లో అది తేలేది కాదు. వీటిలో హరిహర వీరమల్లు షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. అక్టోబర్‌లో దీనికోసమే పవన్ డేట్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలు, ప్రి వర్క్‌షాప్ వీడియో దీనికి సాక్ష్యం. అందులో పవిత్రమైన సరస్వతీ పంచమి రోజున..సరస్వతీ ఆశీస్సులతో హరిహర షెడ్యూల్ వర్క్ షాప్ అని రాసి ఉంది. అక్టోబర్‌లో హరిహర వీరమల్లు బ్యాలెన్స్ పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు పవన్. నిన్నమొన్నటి వరకు ఉన్న లుక్ కాకుండా.. కాస్త మాస్ గెటప్‌లోకి వచ్చారు పవన్.

ఇది చూస్తుంటే కచ్చితంగా మళ్లీ సినిమాల వైపు వస్తున్నారని అర్థమవుతుంది. అయితే అది హరిహర కోసమేనా అనే కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఒక్కటైతే ఖాయం.. రాబోయే మూడు నెలలు పూర్తిగా సినిమాలకే కేటాయించాలని భావిస్తున్నారు పవన్. అదైతే నిర్మాతలకు సంతోషాన్ని కలిగించే విషయం.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే