Bandla Ganesh: పవర్‌స్టార్ పై బండ్లన్న మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అబ్బ ముద్దొస్తున్నావ్ బాస్ అంటూ..
సమయమొచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో పవర్‌స్టార్‌పై తనుకున్న అభిమానాన్ని చాటుకునే బండ్లన్న తాజాగా పవన్ గురించి మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.
బండ్ల గణేశ్.. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా, నిర్మాతగా అంతకుమించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీర భక్తుడిగా ఆయనకు ప్రత్యేక క్రేజ్ ఉంది. దేవర అంటూ సినిమా ఈవెంట్స్ లో తన అభిమాన హీరో గురించి చెప్పిన డైలాగులు, స్పీచ్‌లు ఓ రేంజ్‌లో సెన్సేషన్ అయ్యాయి. సమయమొచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో పవర్‌స్టార్‌పై తనుకున్న అభిమానాన్ని చాటుకునే బండ్లన్న తాజాగా పవన్ గురించి మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. వివరాల్లోకి వెళితే పవర్‌స్టార్ అప్‌కమింగ్ మూవీ హరిహర వీరమల్లు సెట్‌లోని పవన్ న్యూ లుక్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. రెడ్ టీ షర్ట్, జీన్స్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించిన పవన్ న్యూ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు.
వెయ్యి కోట్ల మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా..
ఈ సందర్భంగా పవన్ న్యూ స్టిల్స్‌ను ట్విట్టర్లో షేర్ చేసిన బండ్ల గణేశ్.. ‘అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే.. గుండెల్లో దడ దడ మొదలయ్యింది.. రక్తం ఉరకలేస్తుంది.. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే.? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్’ అంటూ పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా హరిహర వీరమల్లు సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో కనిపించనుంది.
కాగా పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లుతో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్, సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా, సముద్రఖని డైరెక్షన్లో వినోదీయ సితం రీమేక్‌లో నటించనున్నారు. అయితే వీటిలో హరిహర వీరమల్లు షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. అక్టోబర్‌లో దీనికోసమే పవన్ డేట్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఫోటోలు, ప్రి వర్క్‌షాప్ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే గుండెల్లో దడ దడ మొదలయ్యింది రక్తం ఉరకలేస్తుంది.. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే.? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్ @PawanKalyan ❤️ pic.twitter.com/ft9oyx1j9J
— BANDLA GANESH. (@ganeshbandla) September 30, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..