ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఒకే ఒక్క ఫోటో.. అందులో ఏముందంటే ??
ప్రస్తుతం టెన్నిస్ అభిమానుల దృష్టంతా టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆడబోయే లావెర్ కప్‌పైనే ఉంది. తన చిరకాల మిత్రుడు రఫేల్ నాదల్‌తో కలిసి ఫెదరర్ డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు.
ప్రస్తుతం టెన్నిస్ అభిమానుల దృష్టంతా టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆడబోయే లావెర్ కప్‌పైనే ఉంది. తన చిరకాల మిత్రుడు రఫేల్ నాదల్‌తో కలిసి ఫెదరర్ డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. నాదల్, ఫెదరర్ ప్రత్యర్థులుగా ఆఖరి మ్యాచ్ ఆడాలని అభిమానులు కోరుకుంటే.. వాళ్లు మాత్రం కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడనున్నారు. ఇదిలా ఉంటే.. ఫెదరర్ సెప్టెంబర్ 22 రాత్రి తన ట్విటర్‌లో షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురు దిగ్గజ ఆటగాళ్లు ఆఫోటోలో ఉన్నారు. ఆ నలుగురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించేసరికి అభిమానులకు కన్నుల పండువగా మారింది. తనకు సమకాలీన ఆటగాళ్లైన రఫేల్ నాదల్, నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రేలు ఒక ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు. ఫెదరర్ ఆఖరి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ నలుగురు సెప్టెంబర్ 22 రాత్రి హోటల్‌లో డిన్నర్ చేశారు. ఆ తర్వాత లండన్‌లోని థేమ్స్ బ్రిడ్జి వద్ద ఫోటో దిగారు. ఇదే ఫోటోను ఫెదరర్ ట్విటర్‌లో షేర్ చేస్తూ .. మిత్రులతో కలిసి డిన్నర్‌కు వెళ్తున్నా అంటూ క్యాప్షన్ జత చేశాడు. టెన్నిస్ దిగ్గజాలుగా పేరు పొందిన ఈ నలుగురు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి చాలా కాలమైంది. అందుకే ఫెదరర్ పెట్టిన ఫోటోను లక్షలమంది నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. దాదాపు 50 వేలమంది రీ ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

