దోస్త్ మేరా దోస్త్.. తాబేలుతో ఎంజాయ్ చేస్తున్న చిరుత !!
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నాడు ఓ సినీకవి. దానికి తగినట్లుగానే.. దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్.. అంటూ చిరుత, తాబేలు పార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నాయి.
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నాడు ఓ సినీకవి. దానికి తగినట్లుగానే.. దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్.. అంటూ చిరుత, తాబేలు పార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ ఆసక్తికరమైన వైరల్ వీడియోను ఇంటర్నెట్‌లో చూసి నెటిజన్లు తెగ సంబరపడుతున్నారు. స్నేహమంటే ఇదేరా.. అంటూ వారి స్నేహితులను గుర్తుచేసుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక పచ్చిక బయలులో తాబేలు, చిరుత రెండూ సేదతీరుతున్నాయి. అవి రెండూ ఎంతో సన్నిహితంగా ఉన్నాయి. ఈ క్రమంలో తాబేలు చిరుతకు ఏదో రహస్యం చెబుతున్నట్టుంది. చిరుత తన తలను తాబేలు తల దగ్గర పెట్టి ఎంతో ఆసక్తిగా వింటుంది. ఈ సందర్భంగా చిరుత తన మొహాన్ని తాబేలుకు రుద్దుతూ కనిపిస్తుంది. అలా తాబేలు రక్షణ కవచంపై రుద్దుతూ ఆడుకుంటుంది. అవి రెండూ పార్క్‌లో సరదాగా గడుపుతున్న సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కార్సన్ స్ప్రింగ్స్ వైల్డ్‌లైఫ్.. మంచి స్నేహితులు అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. కార్సన్ స్ప్రింగ్స్ యునైటెడ్ స్టేట్స్ ఫ్లోరిడాలోని గైనెస్‌విల్లేలో ఉన్న జంతువుల పార్క్.. ఈ వీడియోలను మిలియన్ మందికి పైగా వీక్షించారు. వేలాది మంది లైక్ చేసి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. స్వచ్ఛమైన స్నేహబంధం అంటూ నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఒకే ఒక్క ఫోటో.. అందులో ఏముందంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

