అతడే లేకపోతే.. ఆ చిన్నారి పరిస్థితేంటి ?? వైరల్ వీడియో
కొంతమంది కొన్నిసార్లు తృటిలో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. కొంతమంది మాత్రం ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతారు. ఒక్కోసారి మనల్ని కాపాడేందుకు దేవుడే ఇతరుల రూపంలో ఉన్నాడానిపిస్తుంది.
కొంతమంది కొన్నిసార్లు తృటిలో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. కొంతమంది మాత్రం ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతారు. ఒక్కోసారి మనల్ని కాపాడేందుకు దేవుడే ఇతరుల రూపంలో ఉన్నాడానిపిస్తుంది. వారు మనం ప్రమాదంలో ఉండగా.. మనల్ని కాపాడతారు. ఇటువంటి వీడియోలు ఒకప్పుడు మనకు పెద్దగా కనిపించేవి కావు కానీ సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఈ వీడియోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ చిన్నారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ సమయంలో ఓ వ్యక్తి చేసిన సాహసం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు. కొంతమంది వ్యక్తులు రోడ్డు పక్కన కూర్చోని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఒక చిన్నారి సైకిల్ మీద కంట్రోల్ తప్పి వేగంగా వస్తుండటం వారు గమనించారు. ఆ చిన్నారికి సైకిల్ కంట్రోల్ కాక విద్యుత్ స్తంభానికి ఢీకొట్టేలా వస్తోంది. ఇది గమనించిన వారిలో ఒక వ్యక్తి ఆ చిన్నారిని సైకిల్ మీది నుంచి లాగేశాడు. వెంటనే సైకిల్ వెళ్లి.. ఒక స్తంభానికి తగిలింది. ఆ వ్యక్తి ఆ చిన్నారిని సైకిల్ మీది నుంచి లాగేయకపోతే.. ఆ చిన్నారి కూడా పోల్‌కి బలంగా ఢీకొట్టేది. ఆ వ్యక్తి చాలా చాకచక్యంతో ఆలోచించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతని సాహసాన్ని తెగ పొగిడేస్తున్నారు. చిన్నారి ప్రాణాలను తృటిలో కాపాడిన వీడియోని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అది వైరల్‌గా మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దోస్త్ మేరా దోస్త్.. తాబేలుతో ఎంజాయ్ చేస్తున్న చిరుత !!
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఒకే ఒక్క ఫోటో.. అందులో ఏముందంటే ??