Watch Video: మద్యం మత్తులో కారు డ్రైవర్‌ హల్‌చల్‌.. బైక్‌ను ఢీ కొట్టి, కరెంట్‌ స్తంభాన్ని కూడా… సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు

మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ ఓ వ్యక్తి హల్​చల్ చేశాడు. అతివేగంగా కారును నడుపుతూ...రోడ్డు పక్కనే ఉన్న బైక్​ను ఢీకొట్టాడు. ఆ తర్వాత

Watch Video: మద్యం మత్తులో కారు డ్రైవర్‌ హల్‌చల్‌.. బైక్‌ను ఢీ కొట్టి, కరెంట్‌ స్తంభాన్ని కూడా... సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
Road Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 07, 2022 | 1:12 PM

మద్యం మత్తులో మందుబాబులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. పోలీసులు తనిఖీలు దాటుకుని మందుబాబులు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతుంటారు. తాగుబోతు వ్యక్తులు చేసే ప్రమాదాల కారణంగా అనేక వారితో పాటు, తోటి వారు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఫుటూగా తాగేసి కారు నడుపుతూ ఆక్సిడెంట్‌ చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్​జబల్​పుర్​లో మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ ఓ వ్యక్తి హల్​చల్ చేశాడు. అతివేగంగా కారును నడుపుతూ…రోడ్డు పక్కనే ఉన్న బైక్​ను ఢీకొట్టాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న కరెంట్​ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు ఆగిపోయింది. వాయువేగంతో కారు కరెంట్‌ స్తంభాన్ని ఢీకొనడంతో ముందు బాగా ధ్వంసమైంది. కరెంట్‌ స్తంభం కూడా వంగిపోయింది. కానీ, ఈ ప్రమాదంలో బైకర్​కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా, బైక్ రైడర్ పేరు పింటూ బర్మన్ అని తెలిసింది. ఘటన అనంతరం రాంఝీ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. కారులోని ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోవడంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాద దృశ్యాలు ఘటనాస్థలిలో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం అనంతరం కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు.

బుధవారం అర్ధరాత్రి తర్వాత రాంజీ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగిందీ ఘటన. కారు గురువారం తెల్లవారుజామున జబల్పూర్ నగరం వైపు వస్తోంది. బైక్ రైడర్ పింటూ బర్మన్ తన ఇంటి బయట నిలబడి ఉన్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారు ముందుగా బైక్‌ను ఢీకొని ఆ తర్వాత విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు బాగా దెబ్బతింది. ఆ కారు కార్తీక్ కొత్వాల్ అనే వ్యక్తికి చెందినదని చెబుతున్నారు. రాంఝీ పోలీస్ స్టేషన్ కారును సీజ్ చేసి మొత్తం ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..