ఊరంతా దుర్గాదేవి శోభాయాత్ర.. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ అనుకోని అతిథి..
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఇంట్లోకి వచ్చిన ఆ అతిథి ఎవరో చెప్పనే లేదు కదా..రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో
ఊరంతా దుర్గాదేవి నిమజ్జనాల్లో కోలాహలంగా ఉన్నారు. ఇళ్లలోని పిల్లలు, పెద్దలు అందరూ అమ్మవారి ఊరేగింపు చూసేందుకు వీధులు బారులు తీరారు. దుర్గాదేవీ శోభయాత్ర వెంట వెళ్తూ డ్యాన్స్, ఆటపాటలతో హంగామా చేస్తున్నారు. కొందరు తమ ఇళ్లకు తలుపులు తాళాలు కూడా వేయకుండానే వెళ్లిపోయారు. అయితే, ఇదే అదునుగా ఓ అనుకోని అతిథి గ్రామంలోకి ప్రవేశించింది. ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించి.. దర్జాగా ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఒక్కో గదిలోకి వెళ్తూ.. ఇళ్లంతా కలియతిరిగింది. అది చూసిన ఆ కుటుంబ సభ్యులు ఇదంతా వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఇంట్లోకి వచ్చిన ఆ అతిథి ఎవరో చెప్పనే లేదు కదా..రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ చిరుతపులి ప్రవేశించింది. అదేదో తనకు బాగా కావాల్సిన వారి ఇళ్లు మాదిరిగా ఇళ్లంతా కలియతిరిగింది..పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని సతారాలో చోటు చేసుకుంది ఈ విచిత్ర సంఘటన. సతారాలోని కోయానగర్‌లోని ఓ ఇంట్లోకి చిరుతపులి చొరబడింది. ఇంట్లోని గదుల్లో దర్జాగా తిరిగింది. కోయానగర్‌కు చెందిన ఓ కుటుంబం గురువారం రాత్రి దుర్గా విగ్రహాల నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడిన చిరుతపులి ఇళ్లంతా కలియతిరిగింది. నిమజ్జనం అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు.. ఓ గది తలపు వద్ద కూర్చొని ఉన్న పులిని చూసి షాక్ అయ్యారు. వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ వెంటనే ఇంటి తలుపులను మూసి గడియపెట్టారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు.
ఇంట్లోకి చిరుతపులి వచ్చిందన్న సమాచారంతో చుట్టుపక్కలవారు పెద్దఎత్తున అక్కడ గుమిగూడారు. కిటికీల్లోనుంచి చిరుతపులిని వీడియోలు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. పులిని బోనులో బంధించి తీసుకెళ్లారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..