Diwali: అమావాస్య తిథి రెండు రోజులు.. ఏ రోజున దీపావళిని జరుపుకోవాలి.. తేదీ, పూజ సమయం పూర్తి వివరాలు మీ కోసం..

దీపావళిని హిందువులు ఉత్సాహంగా, ఆనందోత్సాహాలతో శుభప్రదంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది దీపావళి అమావాస్య రెండు రోజులుగా వచ్చింది.  అమావాస్య తిథి అక్టోబర్ 24వ తేదీ, 2022న సాయంత్రం 05:27 గంటలకు ప్రారంభమవుతుంది.

Diwali: అమావాస్య తిథి రెండు రోజులు.. ఏ రోజున దీపావళిని జరుపుకోవాలి.. తేదీ, పూజ సమయం పూర్తి వివరాలు మీ కోసం..
Diwali 2022
Follow us
Surya Kala

|

Updated on: Oct 13, 2022 | 8:29 AM

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి దీపాల పండుగ దీపావళి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానంకి గుర్తుగా అమావాస్య రోజున దీపావళి పండగను జరుపుకుంటాం. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజున నరక చతుర్దశి గా.. మర్నాడు లోకానికి అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు అమావాస్య రోజున దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.  అంతేకాదు 14 ఏళ్ల పాటు అడవిలో వనవాసం చేసిన శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా దీపావళి పండుగను జరుపుకున్నారని మరొక పురాణకథనం. రాముడు తన భార్య సీత సోదరుడు లక్ష్మణ్ కలిసి వనవాసానికి వెళ్ళాడు. రావణుడిని సంహరించి వనవాసం ముగించుకుని  రాముడు తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చారని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో చీకటి రాత్రి కావడంతో, అయోధ్య ప్రజలు మట్టి దీపాలతో వీధులను వెలిగించి ఆయనకు స్వాగతం పలికారు. నేటికీ, శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజును దీపావళిగా జరుపుకునే సాంప్రదాయం కొనసాగిస్తూనే ఉన్నారు. దీపావళిని హిందువులు ఉత్సాహంగా , శుభప్రదంగా జరుపుకుంటారు.

అయితే ఈ ఏడాది దీపావళి అమావాస్య రెండు రోజులుగా వచ్చింది.  అమావాస్య తిథి అక్టోబర్ 24వ తేదీ, 2022న సాయంత్రం 05:27 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 25వ తేదీ, 2022న సాయంత్రం 04:18 గంటలకు ముగుస్తుంది. దీంతో దీపావళి పండగను ఎప్పుడు జరుపుకోవాలి అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. 25వ తేదీన సూర్యగ్రహణం తో పాటు.. రాత్రికి పాడ్యమి తిథి వస్తుంది కనుక.. ఈ ఏడాది దీపావళి పండగ శుభ సమయం అక్టోబర్ 24వ తేదీనే అని పండితులు చెబుతున్నారు.

దీపావళి 2022: తేదీ, పూజ సమయం

ఇవి కూడా చదవండి

ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 24, 2022 న జరుపుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?