Lord Hanuman: మంగళవారం హనుమంతుడి పూజిస్తున్నారా.. అయితే ఈ నియమాలు పాటించాల్సిందే అంటోన్న శాస్త్రాలు..
మంగళవారం రోజున సనాతన ధర్మం ప్రకారం ఆంజనేయస్వామిని ఆరాధించి, పూజించిన భక్తుడికి సదా ఆయన ఆశీర్వాదం లభిస్తుందని.. అనుగ్రహం వర్షం కురిపిస్తాడని హనుమంతుని ఆశీర్వాదంతో ఎటువంటి భయం లేదా ఆటంకం లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడని నమ్ముతారు.
హిందూమతంలో రామభక్త హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. హనుమంతుడి ఆరాధన అన్ని కష్టాలను తొలగించి, కోరుకున్న వరం దొరుకుతుందని నమ్మకం. అంతేకాదు.. హనుమంతుడు చిరంజీవి అని నమ్ముతారు.. ప్రతి యుగంలోనూ తన భక్తులు పిలిచిన వెంటనే వారి సహాయం కోసం పరిగెత్తారు. సనాతన సంప్రదాయంలో మంగళవారం హనుమంతుడిని పూజించడానికి ఉత్తమమైన, ఫలవంతమైన రోజుగా పరిగణించబడుతుంది. మంగళవారం రోజున సనాతన ధర్మం ప్రకారం ఆంజనేయస్వామిని ఆరాధించి, పూజించిన భక్తుడికి సదా ఆయన ఆశీర్వాదం లభిస్తుందని.. అనుగ్రహం వర్షం కురిపిస్తాడని హనుమంతుని ఆశీర్వాదంతో ఎటువంటి భయం లేదా ఆటంకం లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడని నమ్ముతారు. సకల సంతోషాలను అందించే హనుమంతుడి పూజకు సంబంధించిన సాధారణ చర్యలు, నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం.
హనుమంతుడి పూజ ఎప్పుడు, ఎక్కడ చేయాలి అష్టసిద్ధి ప్రదాత అయిన హనుమంతుని ఆరాధన ఎప్పుడైనా.. ఎక్కడైనా చేయవచ్చు. అయితే వీలైతే, ఎల్లప్పుడూ హనుమంతు పూజను మీ ఇంటికి తూర్పు , ఉత్తర దిశలో కూర్చుని చేయడం ఉత్తమం. హనుమంతుడి నుండి కోరుకున్న ఆశీర్వాదాలు పొందడానికి, ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం నిర్ణీత సమయంలో పూజించండి.
హనుమంతుడి పూజలో స్వచ్ఛత: హనుమంతుని పూజ సమయంలో పరిశుభ్రత గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, హనుమంతుడిని పూజించే ముందు, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. పూజకు ధరించిన వస్త్రాలను మళ్లీ ఉపయోగించవద్దు. మంగళవారం, వీలైతే, ఎరుపు రంగు దుస్తులు ధరించి.. పూజించండి.
మంగళవారం పూజ మంగళవారం నాడు హనుమంతుని నుండి కోరుకున్న ఆశీర్వాదాలు పొందడానికి.. ఆయన ఆలయానికి వెళ్లి సింధూరం, తులసి మాల సమర్పించండి. దీని తరువాత.. నైవేద్యంగా స్వామివారికి అరటిపళ్లు లేదా శనగలు సమర్పించి.. తర్వాత హనుమాన్ చాలీసాను ఏడుసార్లు పఠించండి లేదా సుందరకాండ పఠించండి. ఈ విధంగా రామ భక్తుడిని పూజించిన భక్తులు కోరుకునే వరాలు పొందుతారని నమ్ముతారు.
హనుమంతుని పూజకు సంబంధించిన ముఖ్యమైన నియమాలు మంగళవారం నాడు హనుమంతుడి ఆరాధన విజయవంతం కావడానికి, సాధకుడు బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. మరచిపోయిన కూడా పగ ద్వేషం, ప్రతీకారం వంటి ఆలోచనాలు మదిలో రానివ్వకూడదు. అదే సమయంలో.. హనుమంతుడిని పూజించే భక్తుడు ఈ రోజున ఎవరిపైనా కోపం తెచ్చుకోకూడదు లేదా ఎవరి పట్ల చెడు ఆలోచనలు చేయవద్దు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)