Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు.. ఆరోగ్యం, కుటుంబంపై ఏలినాటి శని ప్రభావం.. ఆయా రాశుల వారికి జాగ్రత్త తప్పనిసరి..

మీరు మీ రోజును మెరుగుపరుచు కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. అందుకోసం ఏం చేయాలి...? వీటిని అనుసరించడం ద్వారా మీరు మీ రోజును శుభప్రదంగా, విజయవంతమైనదిగా మార్చుకోవచ్చు. వాటి సహాయంతో మీరు ఈ రోజు జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు.. ఆరోగ్యం, కుటుంబంపై ఏలినాటి శని ప్రభావం.. ఆయా రాశుల వారికి జాగ్రత్త తప్పనిసరి..
Horoscope Today
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 13, 2022 | 7:38 AM

Today Horoscope : నేటి తేదీ అక్టోబర్ 13, 2022 గురువారం. ఈ రోజు మీకు ఎలా సాగుతుంది? రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? మీరు మీ రోజును మెరుగుపరుచు కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. అందుకోసం ఏం చేయాలి…? వీటిని అనుసరించడం ద్వారా మీరు మీ రోజును శుభప్రదంగా, విజయవంతమైనదిగా మార్చుకోవచ్చు. వాటి సహాయంతో మీరు ఈ రోజు జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అక్టోబరు 13, గురువారం రాశిఫలం ఇక్కడ తెలుసుకుందాం..

మేషరాశి మేషరాశి వారికి ఈరోజు మధ్యస్తం నుంచి అనుకూలంగా ఉంది. కొన్ని చికాకులు ఉంటాయి. కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. పనుల్లో అలసత్వం వహిస్తారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

వృషభ రాశి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో చర్చలకు దూరంగా ఉండండి. మానసికంగా అలసిపోతారు. వృషభ రాశి వారు మీ పనిలో కూడా అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీ లోపాలను మెరుగుపరుచుకోండి. మీ లక్ష్యాన్ని సాధించడానికి చాలా కృషి, ఏకాగ్రత అవసరం. భేదాభిప్రాయ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు వ్యాపార విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే, చిన్నపాటి అజాగ్రత్త వల్ల నష్టం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కార్యాలయంలోని పనులన్నీ శాంతియుతంగా, సానుకూలంగా పూర్తవుతాయి.

ఇవి కూడా చదవండి

మిధున రాశి మిథున రాశికి చెందిన వ్యక్తులు తెలియని వ్యక్తిని నమ్మడం వల్ల మీకు నష్టం జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి.. అలాగే ఇది మీ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగస్తులు పనికి మించిన పనిని పూర్తి చేయడానికి ఇబ్బంది పడతారు. ఉన్నతాధికారుల అసంతృప్తి కూడా అలాగే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించండి. కుటుంబంతో ఆనందంగా గడపండి. ప్రయాణాల్లో ఖర్చులు ఎక్కువయ్యే అవకాశముంది. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

కర్కాటక రాశి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో అనవసర ఖర్చులను అరికట్టడం అవసరం. విశ్రాంతి దొరుకుతుంది. శారీరక సౌఖ్యము పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్త విషయాలు ప్రారంభించేముందు ఆచితూచి ముందుకు వెళ్లండి. ప్రభుత్వోద్యోగంలో పనిచేసే వ్యక్తులు తమ నిర్లక్ష్యం కారణంగా ఉన్నతాధికారుల నుంచి మందలింపులకు గురవుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

సింహ రాశి సింహరాశి జాతకుల సమయం కష్టపడి, పరీక్షతో కూడుకున్నది. మీ లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శత్రువర్గంతో జాగ్రత్త. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. ఆస్తికి సంబంధించిన వ్యాపారంలో పెద్ద డీల్ జరిగే అవకాశం ఉంది. డబ్బు సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. .మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి కన్యా రాశి జాతకులు అనవసర ఖర్చుల వల్ల బడ్జెట్ చెడిపోవచ్చని గుర్తుంచుకోండి. సోమరితనం కారణంగా మీ పనిని వాయిదా వేయడానికి ప్రయత్నించవద్దు. లేదంటే కొన్ని ముఖ్యమైన పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. శారీరక సౌఖ్యం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కీర్తి పెరుగుతుంది. ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయం పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

తులా రాశి తుల రాశి జాతకులు తమ ప్రణాళికలను ఇతరులతో పంచుకోకూడదు. ఒకరిని గుడ్డిగా నమ్మడం హానికరం. ఈ సమయంలో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టకుండా పనికిమాలిన పనుల్లో కాలక్షేపం చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో స్థిరత్వం ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఉద్యోగులతో వాగ్వివాదం రావచ్చు. కానీ సంబంధాన్ని మెరుగ్గా ఉంచుకోండి, లేకుంటే అది మీ వ్యాపారంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగంలో మీరు ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయడం వల్ల కంపెనీకి ప్రయోజనం ఉంటుంది.ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబముతో చర్చలకు దూరంగా ఉండండి. సంతానము వలన సంతోషము కలుగుతుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దక్షిణామూర్తిని పూజించండి.

వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చిన్న విషయాలలో ఎవరితోనైనా విభేదాలు ఏర్పడవచ్చు. కోపం, ఉత్సాహాన్ని నియంత్రించండి. అయితే, సహనం, వివేకంతో మీరు త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటారు. ఏదైనా ప్రమాదకర వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు, మీరు దాని గురించి సరైన సమాచారాన్ని తీసుకోవాలి. ఈ సమయంలో వ్యాపారంలో పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. మీరు సంక్లిష్టంగా వదిలివేస్తున్న పనిపై మళ్లీ దృష్టి పెట్టండి. తప్పకుండా విజయం సాధిస్తుంది. ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. విశ్రాంతి దొరుకుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ఎదుటి వారి మన్నన పొందేందుకు ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

ధనూ రాశి ఈరోజు మీకు చెడు ఫలితాలున్నాయి. కాబట్టి మీరు చేసే ప్రతీ పనిని ఆచితూచి చేయండి. సమయానికి అనుగుణంగా మీ ప్రవర్తనలో మార్పు కూడా అవసరం. డబ్బు విషయంలో ఎవరినీ నమ్మవద్దు. మీ నిర్ణయాలన్నీ మీ స్వంతంగా తీసుకోవడం మంచిది. శారీరక శ్రమ కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మకర రాశి ఈరోజు మీకు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంది. శారీరక సౌఖ్యము, ప్రశాంతత కలుగుతుంది. మీ అతి క్రమశిక్షణ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగిస్తుందని గుర్తుంచుకోండి. విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పడి చదువుతో రాజీ పడకూడదన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో జాగ్రత్త. ఏలినాటి శని ప్రభావం ఆరోగ్యం, కుటుంబంపై ఉంటుంది. వృత్తి వ్యాపారముల్లో జాగ్రత్త వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దత్తాత్రేయుని పూజించండి.

కుంభ రాశి కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. తెలియని వ్యక్తులతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోవద్దు. లేకపోతే మీరు కొన్ని ఇబ్బందుల్లో పడవచ్చు. మీ స్వంత సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. న్యాయపరమైన విషయంలో అనుభవజ్ఞుల సలహాను తప్పకుండా తీసుకోండి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించండి. ఖర్చులు పెరుగుతాయి. రాబడి తగ్గుతుంది. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగము కోసము చేసే ప్రయత్నాలు సఫలమయ్యే సూచన ఉంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దక్షిణామూర్తిని పూజించండి.

మీన రాశి ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. కుటుంబ విషయాలలో సోదరులతో వాగ్వాదం ఉండవచ్చు. మీ స్వభావంలో సహనం, సంయమనం పాటించండి. ఆందోళనలు తగ్గుతాయి. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇంటి పెద్దల సలహాలు, సూచనలు పాటించండి, తప్పకుండా మీకు సరైన పరిష్కారం లభిస్తుంది.శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.