బస్టాండ్‌లోనే పెళ్లి చేసుకున్న విద్యార్థులు.. 16ఏళ్ల అమ్మాయికి తాళికట్టిన 17ఏళ్ల బాలుడు.. వీడియో హల్‌చల్‌

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారి తీవ్ర సంచలనం సృష్టించింది. చాలా మంది నెటిజన్లు.. విద్యార్థుల చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఈ రోజుల్లో కాలేజీ అమ్మాయిల ప్రవర్తన మితిమీరిపోయిందని ఆరోపిస్తున్నారు.

బస్టాండ్‌లోనే పెళ్లి చేసుకున్న విద్యార్థులు.. 16ఏళ్ల అమ్మాయికి తాళికట్టిన 17ఏళ్ల బాలుడు.. వీడియో హల్‌చల్‌
Mangalsutra
Follow us
Jyothi Gadda

| Edited By: Anil kumar poka

Updated on: Oct 12, 2022 | 6:20 PM

ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న 17 ఏళ్ల బాలుడు 16 ఏళ్ల అమ్మాయిని బస్ స్టాప్‌లో స్థానికులంతా చూస్తుండగానే పెళ్లి చేసుకున్నాడు..ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులోని చిదంబరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ప్రస్తుతం తమిళనాడు అంతటా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విచారణ ఆధారంగా, పోలీసులు బాలుడిని అరెస్టు చేసి జువైనల్ అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. మైనర్ బాలికను కౌన్సెలింగ్ కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వీడియో ఆధారంగా తమిళనాడులోకి కడలూరు జిల్లా చిదంబరంలో గల ఓ చిన్న బస్ స్టాప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వీడియోలో కనిపిస్తున్నట్టుగా స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థినికి.. పాలిటెక్నిక్ విద్యార్థి తాళి కట్టాడు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థులు కూడా వారి స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్‌లోనే కనిపించారు.. తోటి విద్యార్థులు వారిపై అంక్షింతలకు బదులుగా కాగితాలు చల్లి అభినందిస్తున్నట్టుగా వీడియోలో స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

వీడియోలో ఉన్న బాధిత విద్యార్థిని పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నట్లుగా తెలిసింది. ఆమెకు తాళి కట్టిన విద్యార్థి కీరపాళ్యం సమీపంలోని ఉత్తర హరిరాజపురం ప్రాంతానికి చెందినవాడని సమాచారం. అక్కడే ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్‌లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ కావటంతో కడలూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఈ ఘటనపై దృష్టిసారించారు. పెళ్లి చేసుకున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ కేసులో తదుపరి చర్యలపై పోలీసులు సమాలోచనలు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారి తీవ్ర సంచలనం సృష్టించింది. చాలా మంది నెటిజన్లు.. విద్యార్థుల చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఈ రోజుల్లో కాలేజీ అమ్మాయిల ప్రవర్తన మితిమీరిపోయిందని ఆరోపిస్తున్నారు.అదే క్రమంలో స్కూల్ అమ్మాయిల పరిస్థితి కూడా రోజురోజుకు దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి స్కూల్ బ్యాగ్, మొబైల్ ఫోన్‌ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని, పిల్లల్ని ఎల్లప్పుడూ ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఘటనలో అబ్బాయిని మాత్రమే కాదు.. అమ్మాయిని కూడా అరెస్ట్ చేయాలంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే