Local Train Fight: తగ్గేదే లే.. రన్నింగ్ ట్రైన్‌లో సిగలు పట్టి మరీ కొట్లాట.. వైరల్ వీడియో మీరు చూశారా
లోకల్ రైళ్లలో జరుగుతున్న గొడవలు, ఘర్షణలు, మహిళల సిగపట్లకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రైలులో సీటు విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. తాజాగా మరో వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
దురదృష్టవశాత్తు లోకల్ ట్రైన్‌లు వికృత చేష్టలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా లోకల్ రైళ్లలో జరుగుతున్న గొడవలు, ఘర్షణలు, మహిళల సిగపట్లకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రైలులో సీటు విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఇద్దరు మహిళలు ముంబయి లోకల్ ట్రైన్ లో సీటు కోసం రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా పోలీసులపై కూడా దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 27 ఏళ్ల మహిళ నిందితురాలని అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా అలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ముంబై లోకల్ ట్రైన్‌లో యువతుల ఫైట్ వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, కొంతమంది మహిళా ప్రయాణికులు ఒకరినొకరు కొట్టుకోవడం కనిపిస్తుంది. మంగళవారం విరార్ నుండి దాదర్ మధ్య వీడియో చిత్రీకరించబడింది.
రైలు ఫ్లోర్‌పై నిలబడే విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. వారం క్రితం ముంబై లోకల్ ట్రైన్‌లో కోచ్‌లో సీట్ల కోసం రెండు గ్రూపుల మహిళలు దూకుడుగా పోరాడిన ఘటన ఇదే జరిగింది. పోరాటాన్ని ఆపేందుకు ఓ పోలీసు రంగంలోకి దిగడంతో ఆమెపై దాడి చేసి గాయాలపాలైంది. నవీ ముంబైలోని వాషి జీఆర్పీలో కేసు నమోదైంది. వీడియో క్లిప్‌లో, మహిళలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి జుట్టు మరొకరు లాగడం కనిపిస్తుంది.
Fight between two female passengers over a seat in Mumbai Local Train. #MumbaiLocal #Fight #ViralVideo #Mumbai pic.twitter.com/A7GiedIUvJ
— AH Siddiqui (@anwar0262) October 6, 2022
ఈ సంఘటనలు ముంబై లోకల్ రైళ్ల ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా ప్రయాణికుల భద్రతపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి