AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big billion sale: బ్రాండెడ్ వాచ్ ఆర్డర్ చేస్తే.. పార్శిల్‌లో పేడ వచ్చింది.. కోపంతో కస్టమర్ ఏం చేసాడో చూడండి!

గతంలో కూడా ఇలాంటి సంఘటనలో, బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా యస్సవి శర్మ అనే కస్టమర్ తన తండ్రికి ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. కానీ బదులుగా కొన్ని సబ్బులు ఉన్న బాక్స్ వచ్చింది.

Big billion sale: బ్రాండెడ్ వాచ్ ఆర్డర్ చేస్తే.. పార్శిల్‌లో పేడ వచ్చింది.. కోపంతో కస్టమర్ ఏం చేసాడో చూడండి!
Flipkart Big Billion Sale
Jyothi Gadda
|

Updated on: Oct 12, 2022 | 10:20 AM

Share

ఇప్పుడు మన దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. లాభదాయకమైన ఆఫర్లు, డిస్కౌంట్ల ద్వారా కస్టమర్లను ఆకర్షించడానికి బ్రాండ్లు ప్రతిదీ చేస్తున్నాయి. సేల్ సీజన్ సమీపిస్తుండటంతో వినియోగదారులు ఉత్తమమైన డీల్‌లను పొందడానికి షాపింగ్ వెబ్‌సైట్‌లకు తరలివస్తున్నారు. దీంతో తరచుగా ప్రజలు ఆర్డర్ చేసిన గాడ్జెట్‌లకు బదులుగా పలు రకాల వేరు వేరు వస్తువులు డెలివరీ కావటం జరుగుతుంది. అలాంటిదే ఇక్కడ మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తను ఆర్డర్‌ చేసిన వస్తువుకు బదులుగా వచ్చిన పార్శిల్‌ చూసి ఆ యువతి కంగుతింది. పార్శిల్‌ ఓపెన్‌ చేయగా, ఆమె కళ్లు బైర్లు కమ్మేసినంత పనైంది. యూపీలోని కౌశాంబి జిల్లాలో ఓ మహిళ తాను ఆర్డర్ చేసిన చేతి గడియారానికి బదులుగా ఆవు పేడను అందుకుంది. తన పరిస్థితిని వివరిస్తూ నెట్టింట్లో ఆమె పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

నీలం యాదవ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో వాచ్ కోసం రూ.1,304 క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకున్నారు . సెప్టెంబరు 28న ఆర్డర్ వచ్చింది. ప్యాక్‌ని తెరిచి చూడగానే అందులో 4 పేడ పిడకలు కనిపించాయి. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె సోదరుడు డెలివరీ బాయ్‌కి ఫోన్ చేసి తన బాధను చెప్పాడు. అయితే దీనిపై ఫిర్యాదు చేయాలని డెలివరీ బాయ్ ఏజెంట్‌ను కోరాడు. అలాగే ఆ తర్వాత ఏజెంట్‌కి ఫోన్ చేయగా.. సమస్యకు క్షమాపణ చెప్పి డబ్బులు వాపస్ ఇస్తానని చెప్పాడు.

ఇలాంటి సంఘటనలో, బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా యస్సవి శర్మ అనే కస్టమర్ తన తండ్రికి ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. కానీ బదులుగా కొన్ని సబ్బులు ఉన్న బాక్స్ వచ్చింది. లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో అతను దీని గురించి రాశాడు. అయితే.. డెలివరీ బాయ్ పార్సిల్‌ ఇచ్చి వెళ్లిపోయాక దాన్ని తెరిచి చూస్తే మాత్రం ఘడీ డిటర్జెంట్ ప్యాకెట్లు కనిపించాయి. దీంతో.. ఇంటిల్లిపాదీ షాకైపోయారు. కస్టమర్‌కేర్‌కు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయిందని యశస్వీ శర్మ వాపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి