Health Tips: మధుమేహం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో మీ షుగర్‌ లెవల్స్‌ మీ కంట్రోల్‌లోనే..

చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. జీవనశైలి మార్పులే ఈ వ్యాధికి కారణమని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధుమేహం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నవారు ఈ సింపుల్ చిట్కాలను

Health Tips: మధుమేహం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో మీ షుగర్‌ లెవల్స్‌ మీ కంట్రోల్‌లోనే..
Diabetes
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 12, 2022 | 10:07 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. జీవనశైలి మార్పులే ఈ వ్యాధికి కారణమని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే మధుమేహానికి చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. నడక మనిషి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే నడక వల్ల శరీరంలోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నడకతో మధుమేహాన్ని నివారించవచ్చని చెప్పారు. నడక రక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహం, ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుంది. మధుమేహం ఆకస్మికంగా వచ్చే వ్యాధి కాదు. క్రమంగా ఈ వ్యాధి శరీరంలో పెరుగుతుంది. మధుమేహం లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. దీని కోసం ఖరీదైన మందులు తీసుకోవలసిన అవసరం లేదు. రోజువారీ జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మీరు తినే ఆహారాలలో మార్పులు చేయడం ద్వారా, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు. ఉదయం పూట కాస్త వ్యాయామం చేయడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

మార్నింగ్‌ వాక్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల శరీరంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. నడక రక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహంతో కలిగే ఇతర సమస్యలను కూడా నివారిస్తుంది. ఇప్పటికే మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల వ్యాధి ముదిరిపోకుండా నివారించవచ్చు. ఉదయం పూట కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే కచ్చితంగా మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఏరోబిక్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మార్నింగ్ ఏరోబిక్స్ మంచిది. ఏరోబిక్ డ్యాన్స్ ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు, వారానికి కనీసం ఐదు రోజులు సిఫార్సు చేయబడింది. ఇలా చేయడం వల్ల మధుమేహం ఉన్న వ్యక్తిలో సానుకూల మార్పు వస్తుంది.

ఇవి కూడా చదవండి

సైక్లింగ్ సైక్లింగ్ వ్యాయామం కోసం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఉదయం పూట కనీసం 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇది అనేక ఇతర వ్యాధులను కూడా నయం చేస్తుంది.

ప్రాణాయామం ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు ప్రతిరోజూ ఉదయం 10 నుండి 15 నిమిషాల పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!