AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar Card Update: మీరు 10 ఏళ్ల క్రితం ఆధార్ తీసుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. యుఐడీఎఐ కీలక ప్రకటన..

పదేళ్లలో ఆధార్ నంబర్ ఒక వ్యక్తి గుర్తింపు రుజువుగా మారిపోయింది. వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ నంబర్ ఉపయోగించబడుతుందని UIDAI తెలిపింది.

Aadhar Card Update: మీరు 10 ఏళ్ల క్రితం ఆధార్ తీసుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. యుఐడీఎఐ కీలక ప్రకటన..
Aadhaar Center
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 12, 2022 | 12:02 PM

ఆధార్ హోల్డర్లకు యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఎఐ) తాజాగా ఓ విజ్ఞప్తి చేసింది. పదేళ్ల క్రితం ఆధార్‌ నమోదు చేసుకుని.. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ చేయనివారి కోసం యుఐడీఎఐ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంటనే తమకు సంబంధించిన పూర్తి సమాచాారాన్ని అప్‌డేట్ చేయాలని కోరింది. తమ వ్యక్తిగత డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థించింది. దీనికి సంబంధించి, డాక్యుమెంట్ అప్‌డేట్ సౌకర్యం అందించినట్లుగా తెలిపింది. నిర్ణీత రుసుముతో వ్యక్తిగత గుర్తింపు రుజువు, ఆధార్ డేటాలోని చిరునామా రుజువు పత్రాలను జోడించాలని కోరింది. ఈ సదుపాయాన్ని ఆన్‌లైన్‌లో కూడా పొందవచ్చని తెలిపింది.

గుర్తింపు కార్డుగా ఆధార్ నంబర్.. 

ఈ పదేళ్లలో ఆధార్ నంబర్ ఓ గుర్తింపు కార్డుగా మారిపోయింది. వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలను పొందేందుకు ఆధార్ నంబర్ తప్పనిసరి అని యుఐడీఎఐ తెలియజేసింది. వివిధ ప్రభుత్వ స్కీమ్‌లు, ప్రభుత్వ సేవలను పొందేందుకు  ఆధార్ ప్రామాణీకరణ, ధృవీకరణలో ఎటువంటి అసౌకర్యం లేకుండా.. తమ వ్యక్తిగత వివరాలతో ఆధార్ డేటాను అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని యుఐడీఎఐ తెలిపింది.

యుఐడీఎఐ అనేది ఒక చట్టబద్ధమైన అథారిటీ, దీనిని భారత ప్రభుత్వం జూలై 12, 2016న ఆధార్ చట్టం, 2016 ప్రకారం స్థాపించింది. ద్వంద్వ, నకిలీ గుర్తింపులను తొలగించడానికి భారతదేశంలోని నివాసితులందరికీ ‘ఆధార్’ అని పిలువబడే ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూఏడీ) జారీ చేయాలనే లక్ష్యంతో ఇది స్థాపించబడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం