AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: స్నేహితుడని నమ్మి వెళ్లింది.. మత్తు మందు ఇచ్చి 9 రోజులు అత్యాచారం.. చివరకు ఇలా బయటపడింది..

స్నేహం ముసుగులో కాలనాగు దాగుంది. అదును చూసే కాటేందుకు సిద్ధంగా ఉంది. అది తెలియని ఆ అమాయకురాలు.. కాలనాగు నాంటి..

Punjab: స్నేహితుడని నమ్మి వెళ్లింది.. మత్తు మందు ఇచ్చి 9 రోజులు అత్యాచారం.. చివరకు ఇలా బయటపడింది..
Physical Harassment
Shiva Prajapati
|

Updated on: Oct 12, 2022 | 12:40 PM

Share

స్నేహం ముసుగులో కాలనాగు దాగుంది. అదును చూసే కాటేందుకు సిద్ధంగా ఉంది. అది తెలియని ఆ అమాయకురాలు.. కాలనాగు నాంటి స్నేహితుడిని నమ్మింది. ఇదే ఛాన్స్ అనుకున్న ఆ దుర్మార్గుడు.. తినే పదార్థాల్లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అమ్మాయి అపస్మారకస్థితిలోకి జారుకోగానే తాను అనుకున్న పని చేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 9 రోజుల పాటు ఆమెను నిర్బంధించి అత్యాచారం చేశాడు. చివరకు స్పృహలోకి వచ్చిన యువతి.. ఎలాగోలా ఆ కీచకుడి చెర నుంచి బయటపడింది. పంజాబ్‌లోని లుధియానాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

లుధియానాలోని హతుర్‌కు చెందిన జస్పాల్ సింగ్, బాధిత యువతి(26) ఇద్దరూ స్నేహితులు. అయితే, తన దుబాయ్ ట్రిప్ కోసం షాపింగ్ చేయడానికి సహాయం కావాలని, సెప్టెంబర్ 30వ తేదీన రాయికోట్‌కు రావాలని యువతిని కోరాడు. దాంతో స్నేహితుడే కదా అని నమ్మిన యువతి అతని కోసం రాయికోట్‌కు వెళ్లింది. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం.. మత్తు మందు ఇచ్చిన ఆహారాన్ని ఆమెతో తినిపించాడు. దాంతో యువతి అపస్మారకస్థితికి చేరుంది. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి యువతిని ఉత్తరప్రదేశ్‌లోని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నాటి నుంచి 9 రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు. అక్టోబర్ 8న యువతి స్పృహలోకి రాగా, ఆ కీచకుడి చెర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలోనూ అతను యువతిపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. మొత్తానికి అతని చెర నుంచి తప్పించుకుని స్వగ్రామానికి వచ్చిన యువతి.. కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు, చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. జస్పాల్ సింగ్‌పై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 342, 376 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..