Pant-Urvashi: వద్దంటున్న పంత్.. వదలనంటున్న ఊర్వశి.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బోల్డ్ బ్యూటీ ట్వీట్..
నిను వీడని నీడను నేనే అంటూ.. టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ వెంట పడుతోంది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా. టీ20 వరల్డ్ కప్‌కి ఇప్పటికే..
నిను వీడని నీడను నేనే అంటూ.. టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ వెంట పడుతోంది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా. టీ20 వరల్డ్ కప్‌కి ఇప్పటికే ఆస్ట్రేలియా వెళ్లాడు పంత్. అక్కడికి కూడా పయనమైంది ఊర్వశి. వెళ్తు వెళ్తూ ట్వీట్ చేసింది. అదే ఇప్పుడు నెటిజన్లకు మండేలా చేసింది. వెంటపడి ఎందుకలా చంపుతావ్ అంటూ ఫైర్ అవుతున్నారు.
నా హృదయాన్ని ఫాలో అవుతున్నా.. అది నన్ను ఆస్ట్రేలియాకు నడిపిస్తుందని ఉర్వశి ట్వీట్ చేసింది. ఫ్లయిట్‌లో ఉన్న స్టిల్స్ యాడ్ చేసింది. చాలా రోజులుగా రిషబ్-ఉర్వశి మధ్య ఏదో ఉందన్న గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అంతేకాదూ ప్రేమించుకుంటున్నారన్న వార్తలూ బయటికొచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో ఆర్‌పి అనే వ్యక్తి తనను కలిసేందుకు ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఎదురుచూశాడని.. కానీ తనకు కుదర్లేదని చెప్పడంతో ఇద్దరి ప్రేమాయణం నడుస్తుందన్న పుకార్లకు బలం ఇచ్చినట్టయింది.
లవ్ ఎఫైర్ కామెంట్లను ఉర్వశి ఎంజాయ్ చేసినప్పటికీ పంత్ మాత్రం భగ్గుమన్నాడు. ప్రేమ లేదు దోమ లేదు అంటూ కొట్టిపడేశాడు. పాపులారిటీ కోసం, వార్తల్లో నిలిచేందుకు కొంతమంది అలాగే చేస్తారని లెఫ్ట్ రైట్ ఇచ్చుకున్నాడు. అంతేకాదు సోదరీ.. నన్ను వదిలేయ్ అని వేడుకున్నాడు.
పంత్ యూఏఈలో ఆసియా కప్‌కి వెళ్తే.. ఉర్వశి కూడా వెళ్లింది. ఇప్పుడు ఆస్ట్రేలియాకు పయనమైంది. దీంతో ఎందుకిలా పంత్‌ని వేధిస్తున్నావంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఓ మహిళా క్రికెటర్‌తో పురుషుడు వ్యవహరిస్తే ఎలా ఉండేదని ప్రశ్నిస్తున్నారు. ఓ అడుగు ముందుకేసిన నెటిజన్లు.. ఉర్వశిని ఓ సైకోగా అభివర్ణిస్తున్నారు. విమర్శలు ఎలా ఉన్నా.. ఉర్వశి మాత్రం పంత్ వెంట పడుతూనే ఉంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..