Delhi: ఢిల్లీలో రెచ్చిపోయిన మహిళలు.. కారును ఆపినందుకు సెక్యూరిటీ గార్డ్‌పై అటాక్..

ఢిల్లీలో ముగ్గురు మహిళలు రెచ్చిపోయారు. కారును ఆపి ప్రశ్నించినందుకు సెక్యూరిటీ గార్డ్‌పై ఎటాక్‌ చేశారు లేడీస్‌. ఈ ఘటన ఇప్పుడు నోయిడాలో రచ్చ రేపుతోంది.

Delhi: ఢిల్లీలో రెచ్చిపోయిన మహిళలు.. కారును ఆపినందుకు సెక్యూరిటీ గార్డ్‌పై అటాక్..
Delhi Lady Attack
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 09, 2022 | 10:18 PM

ఢిల్లీలో ముగ్గురు మహిళలు రెచ్చిపోయారు. కారును ఆపి ప్రశ్నించినందుకు సెక్యూరిటీ గార్డ్‌పై ఎటాక్‌ చేశారు లేడీస్‌. ఈ ఘటన ఇప్పుడు నోయిడాలో రచ్చ రేపుతోంది. వివరాల్లోకెళితే.. ఢిల్లీ ఔట్‌కట్స్‌ నోయిడాలో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్‌పై మహిళలు దాడి చేయడం వివాదాస్పదమైంది. ఓ హౌసింగ్‌ సొసైటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఉజ్వల్‌ శుక్లాపై ఎటాక్‌ చేశారు ముగ్గురు మహిళలు. అర్ధరాత్రి ఒంటి గంట టైమ్‌లో గార్డు చొక్కా కాలర్‌ పట్టుకుని చితకబాదారు. అతని తలపై టోపీని తీసేసి గాల్లోకి విసిరి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అక్కడున్న మిగతా సెక్యూరిటీ గార్డ్స్‌ ఆపేందుకు ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయారు.

సెక్యూరిటీ గార్డుపై దాడి చేయడమే కాకుండా, వీడియోతీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా, వైరల్‌గా మారడంతో రౌడీ లేడీస్‌ నిర్వాకం బయటపడింది. మరోవైపు, బాధితుడు ఉజ్వల్‌ శుక్లా పోలీసులను ఆశ్రయించడంతో మహిళలపై కేసు నమోదైంది. నిందితులు ముగ్గురూ 30ఏళ్లలోపు మహిళలే. నిందితుల్లో అంజలి తివారీ, కాకుల్‌ అహ్మద్‌ను అరెస్ట్‌ చేయగా, మరో నిందితురాలు దీక్షా తివారీ పరారీలో ఉన్నట్టు తెలిపారు పోలీసులు.

ఉద్దేశపూర్వకంగా దాడిచేసి అవమానించినట్టు తేలయడంతో ముగ్గురిపైనా నాన్‌-కాగ్నిజబుల్‌ కేసులు ఫైల్‌ చేశారు. దాడి చేసిన టైమ్‌లో ముగ్గురూ మద్యం మత్తులో ఉన్నారన్నారు పోలీసులు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పురుషులకు రక్షణ కల్పించాలంటూ సెటైరికల్‌గా డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?