AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Heist Type Bank Robbery: ‘మనీ హీస్ట్’ చూసి పని చేస్తున్న బ్యాంక్‌కే కన్నం వేసిన మేనేజర్.. ఏకంగా..

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మనీ హీస్ట్' చూసి మహారాష్ట్రలోని ఓ బ్యాంక్ మేనేజర్ తాను పని చేసే బ్యాంక్‌కే కన్నం వేశాడు. ఏకంగా రూ.34 కోట్లు దోచుకున్నాడు.

Money Heist Type Bank Robbery: ‘మనీ హీస్ట్’ చూసి పని చేస్తున్న బ్యాంక్‌కే కన్నం వేసిన మేనేజర్.. ఏకంగా..
Money Heist
Shiva Prajapati
|

Updated on: Oct 08, 2022 | 10:15 PM

Share

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘మనీ హీస్ట్’ చూసి మహారాష్ట్రలోని ఓ బ్యాంక్ మేనేజర్ తాను పని చేసే బ్యాంక్‌కే కన్నం వేశాడు. ఏకంగా రూ.34 కోట్లు దోచుకున్నాడు. కొన్ని నెలల క్రితం డోంబివిలిలోని ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో రూ.34 కోట్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అసలు నిందితుడు బ్యాంకు మేనేజరే అని తేల్చారు. ఇప్పటి వరకు పోలీసులు రూ. 30 కోట్లు రికవరీ చేశారు.

డోంబివిలిలోని MIDC నివాస ప్రాంతంలో ICICI బ్యాంక్ శాఖ ఉంది. నిందితుడు అల్తాఫ్ షేక్ ఈ బ్యాంకులో క్యాష్ కస్టోడియన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, ధనవంతుడవ్వాలనే ఆశతో.. ఏడాది క్రితం తాను పని చేసే బ్యాంకులోనే దోపిడీ చేశాడు. డబ్బును దోచుకోవడానికి పక్కా పథకం వేశాడు. దీని కోసం అల్తాఫ్ ‘మనీ హీస్ట్’ వెబ్ సిరీస్‌ని చూశాడు. ఆ వెబ్ సిరీస్‌ లో బ్యాంకులో డబ్బులు ఎలా దోచుకుంటారో చూసి మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. అందులోనూ అతను క్యాష్ కస్టోడియన్ మేనేజర్ కావడంతో బ్యాంక్‌కు సంబంధించిన ప్రతీ వివరాలు తెలుసు. అదే అతనికి ప్లస్ అయ్యింది.

మాస్టర్ ప్లాన్ ఇదీ..

ఓ రోజు బ్యాంక్ సేఫ్ రూం పక్కన ఏసీ రిపేరింగ్ వర్క్ చూసి అప్పటి నుంచి ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. ముందుగా భద్రతా వ్యవస్థలోని లొసుగులను గుర్తించాడు. కొద్ది రోజుల తరువాత దోపిడీకి అవసరమైన వస్తువులను తీసుకొచ్చాడు. సెలవు రోజైన జూలై 9న బ్యాంకు అలారం పగులగొట్టి, బ్యాంకులోని అన్ని కెమెరాల హార్డ్ డిస్క్‌లను తొలగించాడు. రూ.34 కోట్లు దోచుకున్నాడు. బ్యాంకు భవనం వెనుక కట్టిన టార్పాలిన్‌పై ఏసీ డక్ట్‌లోని రంధ్రం ద్వారా డబ్బును బయటకు విసిరాడు.

ఇవి కూడా చదవండి

స్నేహితులకు 12 కోట్లు..

ఆ తర్వాత బ్యాంక్‌లోని సీసీటీవీ డీవీఆర్‌ కనిపించడం లేదని బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, సేఫ్‌లోని డబ్బును చెక్ చేసేందుకు ఓ బృందాన్ని బ్యాంకుకు పిలిపించారు. ఓ వైపు విచారణ జరుగుతుండగానే మరో వైపు తన స్నేహితులు ఖురేషీ, అహ్మద్ ఖాన్, అనుజ్ గిరి అనే ముగ్గురికి ఫోన్ చేసి రూ. 34 కోట్లలో రూ. 12 కోట్లు ఇచ్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో దొంగతనం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇలా పట్టుబడ్డాడు..

పోలీసులు విచారణ ప్రారంభించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల నుండి అందిన సమాచారం ఆధారంగా.. రెండున్నర నెలల విచారణ తర్వాత, బ్యాంక్ క్యాష్ కస్టోడియన్ మేనేజర్ అల్తాఫ్ షేక్‌ను పూణేలో అరెస్టు చేశారు. థానే, నవీ ముంబై పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. అల్తాఫ్‌తో పాటు అతని సోదరి నిలోఫర్, మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి తదుపరి విచారణ ప్రారంభించారు.

డబ్బు దాచుకోవడం కోసం అద్దెకు ఫ్లాట్..

చోరీ అనంతరం అల్తాఫ్ షేక్ డబ్బు దాచేందుకు తన సోదరి నీలోఫర్ సాయం తీసుకున్నాడు. దోచుకున్న డబ్బును దాచుకునేందుకు వారిద్దరూ నవీ ముంబైలోని రబాలే ప్రాంతంలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. బ్యాంకులో దొంగిలించిన కొంత డబ్బును ఈ ఫ్లాట్‌లో దాచిపెట్టారు. అలాగే నవీ ముంబై ప్రాంతంలోని పాత భవనం కింద కొంత డబ్బు దాచిపెట్టారు.

మందుబాబులకు దొరికిన డబ్బు..

పాత భవనం కింద దాచిని డబ్బు కొందరు మందుబాబుల దృష్టిలో పడింది. బ్యాగు నిండా డబ్బు కనిపించడంతో.. వారు సంబరపడిపోయారు. అయితే, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వీరికి డబ్బు దొరకగా, ఆ డబ్బును డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా ఈ కేసులో నిందితులను ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు, వారందరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..