Shocking: చుట్టూ వర్షపు నీరు.. మధ్యలో భారీ గొయ్యి.. ఒక్కసారిగా అందులో పడిపోయిన మహిళ.. షాకింగ్ వీడియో..
దేశ వ్యాప్తంగా పలు ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో..
దేశ వ్యాప్తంగా పలు ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించిపోయింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. దాంతో రోడ్లు మార్గం ఏదో, గుంతలు ఏవో, కాలువలు ఏవో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులోని చెంగల్‌పేటకు చెందిన ఓ మహిళ డ్రైనేజీ పనుల కోసం తవ్విన గుంతలో పడిపోయింది. అదృష్టావశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై ఉన్న గుంతలు, డ్రైనేజీ గుంతలు అన్నీ జలమయం అయ్యాయి. దాని కారణంగా రోడ్డు మార్గం కనిపించక జనాలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే.. చెంగల్‌పేటలోని వార్డు నెంబర్ 12లో నివాసం ఉంటున్న మహిళ.. తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు డ్రైనేజీ కోసం తవ్విన గుంతలో పడిపోయింది. గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా ఆ గుంత మొత్తం నీటితో నిండిపోయింది. అక్కడ రోడ్డు ఉందనుకుని ఆమె అడుగు వేయగా.. జారి అందులో పడిపోయింది. అయితే, గుంత లోతుగా లేకపోవడంతో అదృష్టావశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. స్థానికులు వెంటనే అలర్ట్ అయి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఆమెకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. కాగా, ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అంతకుముందు సెప్టెంబర్‌లో చెన్నై శివారల్లో డ్రైనేజీ కోసం తవ్విన గుంటలో వర్షపు నీరు నిండటంతో. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అందులో పడిపోయియన విషయం తెలిసిందే. ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో గుంతలు ఉన్న ప్రాంతంలో హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు.
ఇదిలాఉండగా, మరో మూడు రోజుల పాటు తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదివారం వరకు చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తమిళనాడులో కుండపోత వర్షాలు.. గుంతలో పడిపోయిన మహిళ.. వీడియో..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..