Silver Hallmarking: వెండి నగలు, నాణేలకు హాల్‌మార్కింగ్ అవసరమా? నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

ఈ మధ్య కాలం నుంచి బంగారు అభరణాలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. మరి వెండి అభరణాలకు కూడా హాల్‌మార్క్‌ అవసరం లేదా అనే ప్రశ్న వినియోగదారుల నుంచి తలెత్తుతోంది..

Silver Hallmarking: వెండి నగలు, నాణేలకు హాల్‌మార్కింగ్ అవసరమా? నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
Silver Hallmarking
Follow us
Subhash Goud

|

Updated on: Oct 07, 2022 | 2:43 PM

బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ అవసరం. ఈ నియమాలు మనందరికీ తెలుసు. అయితే వెండి ఆభరణాలు, నాణేల హాల్‌మార్కింగ్ కూడా తప్పనిసరి కాదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పండగ సీజన్‌ నేపథ్యంలో బంగారం, వెండి అభరణాలు జోరుగా కొనసాగుతున్నాయి. వెండి అభరణాలకు హాల్‌మార్క్ ఎందుకు లేదనే ప్రశ్న కూడా తలెత్తవచ్చు. వినియోగదారులు స్వచ్ఛమైన ఆభరణాలను పొందాలంటే హాల్‌ మార్క్‌ తప్పనిసరి చేసింది కేంద్రం. ఈ నిబంధనలు జూన్ 1, 2022 అమల్లోకి వచ్చింది. ఈ తేదీ తర్వాత ఏ నగల వ్యాపారి హాల్‌మార్క్ లేకుండా బంగారు ఆభరణాలను విక్రయించలేరు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్‌) ప్రకారం నగల వ్యాపారి హాల్‌మార్క్ ఉన్న వెండి ఆభరణాలను మాత్రమే విక్రయించడం తప్పనిసరి కాదు.

ఎవరైనా స్వర్ణకారుడు హాల్‌ మార్కింగ్‌తో వెండి అభరణాలు విక్రయించాలనుకుంటే విక్రయించుకోవచ్చు. కానీ ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ఉండాలనే నిబంధన లేదు. దీంతో ఆభరణాల స్వచ్ఛత పెరిగి కస్టమర్లలో నగల వ్యాపారిపై నమ్మకం పెరుగుతుంది. కస్టమర్ కోరుకుంటే అతను ఆభరణాల వ్యాపారి నుండి హాల్‌మార్కింగ్ కోరవచ్చు. దీని కోసం స్వర్ణకారుడు హాల్‌మార్కింగ్ కోసం కొంత రూసుము వసూలు చేస్తారు. కస్టమర్‌కు హాల్‌ మార్కింగ్‌ కావాలనుకుంటే నగర వ్యాపారి అభరణాలను తయారు చేసి హాల్‌మార్క్‌ పరీక్షా కేంద్రానికి పంపుతాడు. అప్పుడు హాల్‌మార్కింగ్ ఛార్జీని జోడించి ఆభరణాలు కస్టమర్‌కు అందజేస్తాడు.

బంగారంపై హాల్‌మార్కింగ్ గుర్తు ఉన్నట్లే, వెండి ఆభరణాలకు కూడా హాల్‌మార్కింగ్ గుర్తు ఉంటుంది. బీఐఎస్‌ గుర్తుతో ఆభరణాలపై సిల్వర్‌ అని అని రాయబడుతుంది. వెండి స్వచ్ఛత గ్రేడ్ లేదా ఫైన్‌నెస్ కూడా రాయబడుతుంది. హాల్‌మార్కింగ్ చేసే కేంద్రం, ఆ కేంద్రం గుర్తింపు గుర్తును వెండి నగలకు అతికిస్తారు. దీంతో పాటు వెండి ఆభరణాలపై నగల వ్యాపారి గుర్తు లేదా తయారీదారు గుర్తింపు గుర్తును కూడా ముద్రించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వెండి ఆభరణాల హాల్‌మార్కింగ్‌తో, ఏ గ్రేడ్ ఆభరణాలను కొనుగోలు చేశారో వినియోగదారుడికి తెలుస్తుంది. స్వర్ణకారులు తరచుగా వెండికి సీసం పదార్థాన్ని జోడిస్తారు. ఇది వెండి నగలు లేదా పాత్రలను తయారు చేయడాన్ని సులభతరం అవుతుంది. చాలా మంది ప్రజలు తినడానికి, తాగడానికి వెండి పాత్రలను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో ఆ పాత్రలో ఎక్కువ సీసం ఉంటే అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. హాల్‌మార్కింగ్‌ చేస్తే వెండి ఆభరణాలు, పాత్రల్లో సీసం ఎంత ఉందో తెలుస్తుంది. దీంతో వెండి స్వచ్ఛత గురించి కూడా కస్టమర్లకు సమాచారం అందుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి