Credit Card Buying Tips: మీరు కూడా క్రెడిట్ కార్డ్ అప్పుల ఉచ్చులో చిక్కుకున్నారా.. ఇలా చేస్తే ఈజీగా తిరిగి చెల్లించవచ్చు..
క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అప్పుల ఊబిలో చిక్కుకుంటూనే ఉంటారు. మీరు కూడా డిస్కౌంట్ల కారణంగా క్రెడిట్ కార్డ్ రుణాల ఉచ్చులో పడి ఉంటే.. భయపడాల్సిన అవసరం లేదు..
పండుగల సీజన్ కొనసాగుతోంది. ఇ-కామర్స్ సైట్లు ఆకర్శనీయమైన ప్రకటనలు జారీ చేస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో కనిపించిన అన్నింటింని ఒకే ఒక క్లిక్‌తో కొనస్తుంటాం. అంతే కాదు ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా లేదా ఏదైనా షాపులో బిల్లు చెల్లించాలన్నా క్రెడిట్ కార్డు స్వైప్ చేయడం కామన్‌గా మారిపోయింది. ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేయగలగడమే ఇందుకు కారణం. క్రెడిట్ కార్డ్.. పేరులో ఉన్నట్లే మనం క్రెడిట్ కార్డుతో ఖర్చు చేసే ప్రతి రూపాయీ అప్పు తీసుకున్నట్లే.. అయితే ఇక్కడ కొంత వడ్డీ రహిత కాలవ్యవధి లభిస్తుంది. ఇదే ఇందులో ఉన్న ప్రయోజనం. దీన్ని ఒక ప్రణాళిక ప్రకారం సరిగ్గా వాడుకుంటే ప్రయోజనాల కంటే నష్టాలనే ఎక్కువ. అలా కాకుండా ఇష్టారీతిన వాడితే రుణ వలయంలో చిక్కకుపోవడానికి ఎంతో కాలం పట్టదు. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించనందుకు కంపెనీలు వినియోగదారులపై భారీ జరిమానాలు విధిస్తాయి. దీని తర్వాత వినియోగదారులు అప్పుల ఊబిలో చిక్కుకుంటారు.
క్రెడిట్ కార్డ్ రుణ చెల్లింపు..
మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్‌లో కూడా చాలా పెద్ద మార్పులు వచ్చాయి. గత కొన్నేళ్లుగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వినియోగం వేగంగా పెరిగింది. క్రెడిట్ కార్డుల ద్వారా ఎలాంటి ఆలోచించకుండా షాపింగ్ చేసి.. ఆపై అప్పుల భారంలో మునిగిపోతున్నారు.
పండుగల సీజన్ ప్రారంభం కావడంతో, అనేక క్రెడిట్ కార్డ్ కంపెనీలు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు విపరీతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కస్టమర్‌లు చిన్న నుంచి పెద్ద వస్తువులపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. అయితే చాలా సార్లు చౌకైన వస్తువుల కోసం క్రెడిట్ కార్డ్‌లతో ఎక్కువ షాపింగ్ చేస్తారు. వారు తమ బిల్లులను తర్వాత చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతుంటారు.
తమ క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించనందుకు కంపెనీలు వినియోగదారులపై భారీ జరిమానాలు విధిస్తాయి. దీని తర్వాత వినియోగదారులు అప్పుల ఊబిలో చిక్కుకుంటూనే ఉంటారు. మీరు కూడా డిస్కౌంట్ల కారణంగా క్రెడిట్ కార్డ్ రుణాల ఉచ్చులో పడి ఉంటే.. భయపడాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని సాధారణ దశలను తీసుకోవడం ద్వారా క్రెడిట్ కార్డ్ రుణ ఉచ్చు నుంచి బయటపడవచ్చు. దీని గురించి తెలుసుకుందాం..
క్రెడిట్ కార్డ్ అప్పుల ఉచ్చులో చిక్కుకున్నట్లయితే..
బిల్లును EMIగా మార్చుకోండి..
మీరు కూడా క్రెడిట్ కార్డ్ అప్పుల ఉచ్చులో చిక్కుకున్నట్లయితే ముందుగా మీ క్రెడిట్ కార్డ్ బిల్లును EMIగా మార్చుకోండి. దీంతో ప్రతి నెలా తక్కువ మొత్తంలో రుణాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు.
బిల్లును మరొక క్రెడిట్ కార్డ్‌కి బదిలీ..
మీరు క్రెడిట్ కార్డ్ వడ్డీతో ఇబ్బంది పడుతుంటే, మీరు ముందుగా మీ క్రెడిట్ కార్డ్ బిల్లును మరొక క్రెడిట్ కార్డ్‌కి బదిలీ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు ప్రతి నెలా వసూలు చేసే భారీ వడ్డీ నుంచి ఉపశమనం పొందుతారు. ఆ తర్వాత మీరు దానిని చిన్న EMIగా ఎంచుకోవచ్చు.
బకాయి మొత్తాన్ని చెల్లించడానికి..
మీరు క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ పొందిన ప్రతిసారీ, మొత్తం బకాయిలను సకాలంలో చెల్లించాలని నిర్ధారించుకోండి. స్టేట్‌మెంట్ తేదీ నుంచి బకాయి మొత్తాన్ని చెల్లించడానికి మీకు కొన్ని రోజుల సమయం లభిస్తుంది. సాధారణంగా ఇది 30-45 రోజులు ఉండొచ్చు. ఈ లోపు 5 శాతం కనీస బిల్లు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని వాయిదాలు వేయకుండా పూర్తి బిల్లును సకాలంలో చెల్లించడం వల్ల వడ్డీ, పెనాల్టీల అదనపు భారం పడకుండా జాగ్రత్త పడొచ్చు.
వ్యక్తిగత రుణం తీసుకుని..
మీరు క్రెడిట్ కార్డ్ రుణాల ఉచ్చులో తీవ్రంగా చిక్కుకున్నట్లయితే దాన్ని తిరిగి చెల్లించడానికి మీరు ఏదైనా బ్యాంకు నుండి వ్యక్తిగత రుణాన్ని కూడా తీసుకోవచ్చు. సాధారణంగా, చాలా బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై 10% నుండి 12% వడ్డీ రేటును వసూలు చేస్తాయి. క్రెడిట్ కార్డ్‌లపై ఇది 20% వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు వ్యక్తిగత రుణం తీసుకోవడం ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించి, తర్వాత మీ వ్యక్తిగత రుణ మొత్తాన్ని EMI ద్వారా తిరిగి చెల్లించండి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..