AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన బిగ్ అప్డేట్.. ఈ రైతులకు 12 విడత డబ్బులు రావు.. ఎందుకంటే..

తి ఏడాది అన్నదాతలకు రూ. 6000 ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే ఈ నగదు ఓకే సారి కాకుండా.. సంవత్సరంలో మూడు విడతల వారిగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన బిగ్ అప్డేట్.. ఈ రైతులకు 12 విడత డబ్బులు రావు.. ఎందుకంటే..
Pm Kisan
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2022 | 12:51 PM

Share

దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఏడాది అన్నదాతలకు రూ. 6000 ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే ఈ నగదు ఓకే సారి కాకుండా.. సంవత్సరంలో మూడు విడతల వారిగా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రతి విడతలో రూ. 2000 అందిస్తుంది. అయితే ఇప్పటివరకు కేంద్రం 11 విడతల నగదును అన్నదాత ఖాతాల్లో జమచేసింది. ఇక ఇప్పుడు 12వ విడత నగదు విడుదల చేయనుంది. ఈ డబ్బు కొందరు రైతులు పొందలేరు. ఎందుకో తెలుసుకుందమా.

పీఎం కిసాన్ 12వ విడత నగదు పొందాలంటే ముందుగా రైతులు eKYC పూర్తిచేయాల్సి ఉంటుంది. eKYC పూర్తిచేయని రైతులు ఈ డబ్బును పొందలేరు. పీఎం కిసాన్ పథకంలో రిజిస్టర్డ్ అయిన రైతులు తప్పనిసరిగా eKYC చేయించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ ఆధారిత eKYC అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC పూర్తిచేసేందుకు మీ సమీపంలోనీ సీఎస్సీ కేంద్రాలను సంప్రదించవచ్చు.

ఆన్‌లైన్‌లో e-KYC ప్రక్రియను పూర్తి చేయడం..

1. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లాగిన్ కావాలి. 2. ఆ తర్వాత కుడి వైపున ఉన్న eKYC ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 3. తర్వాత ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి. 4. ఆధార్ కార్డ్ కు లింక్ అయిన ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. 5. గెట్ ఓటీపీ పై క్లిక్ చేసి.. ఓటీపీని ఎంటర్ చేయాలి. 6. మీ డేటా మొత్తం కరెక్ట్ గా సరిపోలితే మీ eKYC విజయవంతం అయినట్లే. లేదంటే రిజెక్ట్ అవుతుంది. 7. లబ్దిదారులు తప్పుగా డిక్లరేషన్ చేస్తే.. అప్పటివరకు పొందిన పీఎం కిసాన్ నగదు తిరిగి రికవరీ చేస్తారు.

ఇవి కూడా చదవండి

బ్యాలెన్స్ తనిఖీ చేయాడానికి చర్యలు..

1. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లాగిన్ కావాలి. 2. తర్వాత రైతు కార్నర్ పై క్లిక్ చేయాలి. 3. తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లబ్దిదారుడు దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. 4. జాబితాలో రైతు పేరు.. అతని బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు చూపిస్తుంది. 5. ఇప్పుడు మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ లేదా మొబలై నంబర్ ఎంటర్ చేయాలి. 6. ఆ తర్వాత డేట్ పొందండి (గెట్ డేటా)పై క్లిక్ చేయాలి.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..