Mrunal Thakur: డేటింగ్ పై సీతారామం బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. 20 ఏళ్ల వయసులో ప్రేమ 30 ఏళ్లకు ఇలా మారుతుందంటూ…

డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాతో సౌత్ ఆడియన్స్‏కు పరిచయమైన మృణాల్.. తాజాగా డేటింగ్ పై స్పందించింది.

Mrunal Thakur: డేటింగ్ పై సీతారామం బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. 20 ఏళ్ల వయసులో ప్రేమ 30 ఏళ్లకు ఇలా మారుతుందంటూ...
Mrunal Thakur
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 07, 2022 | 8:49 AM

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. నార్త్ ఇండియన్ అమ్మాయి అయినా.. అచ్చం తెలుగమ్మాయిగా కనిపించి మెప్పించింది. అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంది. డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో దక్షిణాది ఆడియన్స్‏కు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో మృణాల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కోసం వరుస ఆఫర్లు క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న మృణాల్.. ప్రేమ, పెళ్లి, వయసు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సాధారణంగా తన వయస్సు ఎంత ? అని ప్రజలు తనను అడుగుతారని.. తన వయసు 30 ఏళ్లు అని చెప్పగానే వెంటనే పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తారని చెప్పుకొచ్చింది. నువ్వు పెళ్లి చేసుకోవాలి.. వివాహం గురించి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? నీకు 32 ఏళ్లు వచ్చేసరికి పిల్లలు పుడతారా ? అని ప్రశ్నిస్తారని.. దీంతో వారి నుంచి దూరంగా వచ్చేనని తెలిపింది మృణాల్. అలాగే 20 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు.. 30 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపింది. 20 ఏళ్లలో ప్రాథమిక విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోరని.. ఆ వయసులో ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే.. మనం కూడా ప్రేమిస్తామని.. కానీ 30 ఏళ్ల వయసులో ఆ వ్యక్తిని నేను ఎక్కువగా ప్రేమించాలని..

అతను మనకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటామని తెలిపింది. వయసులో కలిగే ప్రేమ పట్ల పారదర్శకత ఉంటుందని.. 20 ఏళ్లలో అన్వేషించడం.. పలు అంశాల గురించి నేర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే.. 30 ఏళ్ల నాటికి తన భాగస్వామి నుంచి ఏమి ఆశించాలి అనే విషయాలపై స్పష్టత వచ్చినట్లు తెలిపింది.

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..