AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ఆదిపురుష్ టీజర్ 3డి స్క్రీనింగ్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్.. రాముడిగా మెప్పించిన ప్రభాస్..

ఆదిపురుష్ టీజర్ 3డి మీడియా స్పెషల్ ప్రీమియర్స్‏కి అనూహ్య స్పందన వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Adipurush: ఆదిపురుష్ టీజర్ 3డి స్క్రీనింగ్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్.. రాముడిగా మెప్పించిన ప్రభాస్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2022 | 8:24 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఆదిపురుష్ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రామాయణ ఇతిహాస నేపథ్యంతో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించగా.. కృతి సనన్ సీతగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొంచిందిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‏ అద్భుతమైన రెస్పాన్స్‏తో రికార్డులు తిరగరాస్తుంది. ఇక తాజాగా మీడియా కోసం ఏఎంబి థియేటర్లో వేసిన స్పెషల్ షో అందరినీ అబ్బురపరచింది.

ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ, “మొదటిసారి మా టీజర్ ని 3D లో చూస్తూ చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యాను. అభిమానులకోసం 60 థియేటర్లలో 3D టీజర్ వేస్తున్నాం. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. మీ అందరి అభిమానం, ఆశీస్సులు మాకు కావాలి . రానున్న 10 రోజుల్లో మరింత మంచి కంటెంట్ తో మీ ముందుకి వస్తున్నాం.” అన్నారు. దర్శకుడు ఓం ఓం రౌత్ మాట్లాడుతూ.. ” 3D లో టీజర్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. దిల్ రాజు గారు ఇక్కడకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాత భూషణ్ మాట్లాడుతూ, ” మీ రెస్పాన్స్ కి చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా ఇష్టంతో మీ అందరికీ నచ్చేలా చిత్రీకరించాం. ప్రభాస్, ఓం రౌత్ చాలా కష్టపడ్డారు. మీ అందరి ఆశీస్సులు మాకుంటాయని ఆశిస్తున్నాను” అన్నారు. నిర్మాత రాజేష్ నాయర్ మాట్లాడుతూ, ” జై శ్రీరాం, అదొక్కటే మంత్రం ఇక. ఓం, ప్రభాస్ ఈ చిత్రాన్ని థియేటర్ల కోసమే చేసారు. భక్తితో చేసిన ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నాం.” అన్నారు.

Follow Us