Rashmika Mandanna: ఆ విషయంలో రష్మిక గురించి భయపడుతున్న ఫ్యామిలీ మెంబర్స్.. ఎందుకంటే..

సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో రష్మిక మందన్నా ఒకరు. నేషనల్ క్రష్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ఈ అమ్మడు ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తోంది. కానీ ఓ విషయంలో తన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ భయపడుతున్నారట. ఎందుకో తెలుసా...

Rashmika Mandanna: ఆ విషయంలో రష్మిక గురించి భయపడుతున్న ఫ్యామిలీ మెంబర్స్.. ఎందుకంటే..
Rashmika
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 07, 2022 | 9:50 AM

కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది రష్మిక మందన్నా. మొదటి సినిమాతో హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత ఛలో మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఫస్ట్ మూవీ ఆశించినంతంగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోయింది. ఇటీవల అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‏గా గుర్తింపు పొందింది. దీంతో తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ భాషల్లోనూ వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ప్రస్తుతం హిందీలో గుడ్ బై, యానిమల్, మిస్టర్ మజ్నూ… తమిళంలో వరిసు చిత్రాల్లో నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న గుడ్ బై చిత్రం ఈరోజు (అక్టోబర్ 7)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన వ్యక్తిగత… ఫ్యామిలీ విషయాలను పంచుకుంది. తాను మొదటి సారి సినిమాల్లోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు తన తల్లిదండ్రులు వద్దని చెప్పారంటూ చెప్పుకొచ్చింది. ” వాళ్లు నాకు ఎప్పటికీ తోడుగా ఉంటారు. నా నిర్ణయాలకు వారు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. అలాగే వాళ్లు చెప్పే ప్రతి మాటను నేను అంగీకరిస్తాను. నేను చిత్రపరిశ్రమలోకి రావాలనుకున్నాను. ఆ ప్రపంచంలో ఎలా ఉండగలవు ? అని అన్నారు. నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలనేది నాకు తెలుసు. కానీ ఇప్పటికీ వాళ్లు నా గురించి ఆందోళన చెందుతారు.” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.

కామెడీ డ్రామాగా తెరకెక్కిన గుడ్ బై చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. త్వరలోనే రష్మిక పుష్ప 2 చిత్రీకరణలో పాల్గోననుంది.

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..