OTT Releases: నేడు మూవీ లవర్స్‌కు పండగే పండగ.. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌ల లిస్టు ఇదే
అక్టోబర్ 7వ తేదీన అంటే ఈ శుక్రవారం కూడా ఓటీటీల్లో పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే ఎలాంటి హడావిడి లేకుండానే ఆమిర్‌ఖాన్ నటించిన లాల్‌సింగ్ చద్దా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమిర్, చైతూ, కరీనాల నటనను మరోసారి వీక్షించాలనుకునేవారికి ఇది మంచి సినిమా అని చెప్పవచ్చు.
దసరా సంబరాలను రెట్టింపు చేసేలా మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమా థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది. అలాగే నాగార్జున ది ఘోస్ట్, స్వాతిముత్యం లాంటి సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక దసరా రోజున కార్తికేయ లాంటి హిట్ సినిమాలు, పలు వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇక అక్టోబర్ 7వ తేదీన అంటే ఈ శుక్రవారం కూడా ఓటీటీల్లో పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే ఎలాంటి హడావిడి లేకుండానే ఆమిర్‌ఖాన్ నటించిన లాల్‌సింగ్ చద్దా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమిర్, చైతూ, కరీనాల నటనను మరోసారి వీక్షించాలనుకునేవారికి ఇది మంచి సినిమా అని చెప్పవచ్చు. ఇక శుక్రవారం కీరవాణి కుమారుడు, యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన దొంగలున్నారు జాగ్రత్త సినిమా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
పునీత్ సినిమాతో పాటు..
అలాగే కన్నడలో లక్కీ మ్యాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కాబోతోంది. ఇందులో దివంగత పునీత్ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించడం విశేషం. వీటితో పాటు గ్లిచ్ అనే ఒక కొరియన్ వెబ్ సిరీస్ మొదటి సీజన్, ది జెఫ్రీ డోమర్ టైప్స్ అనే ఇంగ్లిష్ వెబ్ సిరీస్, ది మోల్ సీజన్ వన్ అనే ఇంగ్లిష్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్నాయి. ఇక ఇంగ్లిష్ భాషలోని నెట్‌ఫ్లిక్స్ సిరీస్ లలో ది మిడ్ నైట్ క్లబ్, డెర్రీ గర్ల్స్, ఆడ్ బాల్స్, మాన్ ఆన్ పాజ్, వెబ్ సిరీస్ లు స్ట్రీమ్ కాబోతున్నాయి. అలాగే జపనీస్ భాషలో టైగర్ అండ్ బన్నీ అనే వెబ్ సిరీస్ సీజన్ 2 లోని పార్ట్ 2 విడుదల కాబోతోంది. ఇవి కాక లక్కీయస్ట్ గర్ల్ అలైవ్, ది రిడీమ్ టీం అనే ఇంగ్లిష్ సినిమాలు, ఓల్డ్ పీపుల్ (జర్మన్), డాల్ హౌస్ (ఫిలిపినో) సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతున్నాయి.
ఇక అమెజాన్ ప్రైమ్‌లో హిందీ మూవీ మజా మా తో పాటు ది సౌండ్ ఆఫ్ 007 అనే డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే.. ప్రే అనే ఒక ఇంగ్లిష్ మూవీ రాబోతోంది. హిందీలో కూడా ఆ సినిమా విడుదల కానుంది. చూశారుగా.. ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా.. మరి ఎంచెక్కా వీటిని చూస్తూ వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి.
#DongalunnaruJagratha OCTOBER 7 TAMIL. TELUGU . Malayalam@Netflix_INSouth pic.twitter.com/5rRhXs48fC
— OTTGURU (@OTTGURU1) October 5, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..