Hyderabad: శ్మశాన వాటికలో తిరుగాడుతోన్న భారీ కొండ చిలువ .. హైదరబాదీలను హడలెత్తిస్తోన్న వీడియో
సుమారు 6 అడుగుల పొడవైన కొండ చిలువ సమాధుల్లో తిరగాడుతుండగా కొందరు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. ఆతర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో ఉన్న ముస్లిం శ్మశానవాటికలో ఓ పెద్ద కొండ చిలువ హల్‌చల్ చేసింది. సుమారు 6 అడుగుల పొడవైన కొండ చిలువ సమాధుల్లో తిరగాడుతుండగా కొందరు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. ఆతర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నగరవాసులు ఆ వీడియోను చూసి హడలెత్తిపోతున్నారు. వీడియోలో వినిపిస్తోన్న మాటల ప్రకారం.. ఫలక్ నుమాలోని ఖాద్రి చమాన్ శ్మశానవాటికలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా శ్మశానవాటికలో భారీ కొండచిలువ కనిపించడంతో ఆ చుట్టుపక్కల ఉండే స్థానికులు హడలెత్తిపోతున్నారు.
అంతేకాకుండా ఇదే శ్మశానవాటికలో ఒక పెద్ద చింత చెట్టు ఉందని, చింతకాయల కోసం తరచుగా పిల్లలు ఇక్కడికి వెళతారని ఆందోళన చెందుతున్నారు. కాగా కొండ చిలువ అక్కడే సమాధుల మధ్య ఆశ్రయం చేసుకుని నివాసం ఉంటున్నట్టు అర్థమవుతోంది. సమాధుల కింద ఇలాంటి పాములు ఇంకెని ఉన్నాయో అనే భయం స్థానికులను వెంటాడుతోంది. వీలైనంత తొందరగా ఆ కొండచిలువను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. దీనిని చూసి నగరవాసులు హడలెత్తిపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..