Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable With NBK 2: దెబ్బకు థింకింగ్‌ మారిపోవాలా.. ఈసారి అంతకుమించి.. అదిరిపోయిన అన్‌స్టాపబుల్ సీజన్‌2 టీజర్‌..

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా అందిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే మొదటి సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ, దర్శకధీరుడు రాజమౌళి తదితర సెలబ్రిటీలతో ఈ ఛాట్‌షోలో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు.

Unstoppable With NBK 2: దెబ్బకు థింకింగ్‌ మారిపోవాలా.. ఈసారి అంతకుమించి.. అదిరిపోయిన అన్‌స్టాపబుల్ సీజన్‌2 టీజర్‌..
Unstoppable With Nbk
Follow us
Basha Shek

|

Updated on: Oct 04, 2022 | 11:04 PM

సిల్వర్‌స్ర్కీన్‌పై తనదైన డైలాగులు, నటనతో రెచ్చిపోయే బాలయ్య డిజిటల్‌ స్ర్కీన్‌పైనా అదరగొడుతున్నారు. ఎక్కడైనా తగ్గేదేలే అంటూ హోస్ట్‌గానూ ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా అందిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే మొదటి సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ, దర్శకధీరుడు రాజమౌళి తదితర సెలబ్రిటీలతో ఈ ఛాట్‌షోలో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈసారి అంతకుమించి అనేలా సెకండ్‌ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సీజన్ 2 గురించి అదిరిపోయే ఆప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఊరిస్తున్నారు ఆహా బృందం. ఇప్పటికే రిలీజైన టాక్‌ షో ర్యాప్‌సాంగ్‌, సీజన్‌లో బాలయ్య బాబు పోస్టర్‌, అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టైటిల్ సాంగ్ సెకెండ్‌ సీజన్‌పై అంచనాలను పెంచేశాయి. ఇక దసరా కానుకగా మంగళవారం సాయంత్రం విజయవాడలో ప్రి లాంచ్‌ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో సీజన్‌కు సంబంధించి టీజర్‌ను విడుదల చేశారు.

ఎప్పటిలాగే ఈ టీజర్‌లో తనదైన స్టైల్‌, మ్యానరిజంతో అదరగొట్టేశారు బాలయ్య.ఈసారి కొత్తగా కౌబాయ్‌ గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు కనువిందు చేశారు. టీజర్‌ చివరిలో చెప్పినట్లు చివరిలో దెబ్బకు థింకింగ్‌ మారిపోవాలా అంటూ ఈసారి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను, ఫన్‌ను అందించేందుకు బాలయ్య రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో మొదటి గెస్ట్ గా తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయడు హాజరు కానున్నారని తెలుస్తోంది. బాలయ్య షోకు చంద్రబాబు హాజరైన ఫోటోలు లీక్ అవ్వడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.మరి ఈ ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరుగుతాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు ఈసారి బాలయ్య షోలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..