ఏటీఎం దగ్గర గంటల తరబడి నిల్చున్న వ్యక్తి.. దగ్గరి కెళ్లి టచ్‌ చేస్తే దిమ్మతిరిగే షాక్‌..

ఏటీఎం సెంటర్‌లో ఎవరైనా ఉంటే వేరొకరు లోనికి వెళ్లరు. వారు తిరిగి బయటకు వచ్చేవరకు అక్కడే ఆగిపోతారు. అయితే యూకేలోని ఒక ఏటీఎం వద్ద ఒక వ్యక్తి గంటల తరబడి నిల్చొని ఉన్నాడు. ఎంతకీ కదల్లేదు. మరోపక్క జనాలతో క్యూ పెరిగిపోతుంది.

ఏటీఎం దగ్గర గంటల తరబడి నిల్చున్న వ్యక్తి.. దగ్గరి కెళ్లి టచ్‌ చేస్తే దిమ్మతిరిగే షాక్‌..
Atm
Basha Shek

|

Oct 02, 2022 | 11:51 AM

అప్పుడప్పుడు ఏటీఎం సెంటర్ల వద్ద క్యూ ఉంటుంది. ముఖ్యంగా నెల ఆరంభంలో డబ్బులు విత్‌ డ్రా చేయడానికి లేదా డిపాజిట్‌ చేయడానికి చాలామంది ఏటీఎం సెంటర్లకు పరుగులు తీస్తుంటారు. ఏటీఎం కార్డుల వివరాలు, పాస్‌వర్డ్స్‌ గోప్యంగా ఉంచుకోవాలి. ఇతరులకు తెలియకూడదు. ఈ కారణంగానే ఏటీఎం సెంటర్‌లో ఎవరైనా ఉంటే వేరొకరు లోనికి వెళ్లరు. వారు తిరిగి బయటకు వచ్చేవరకు అక్కడే ఆగిపోతారు. అయితే యూకేలోని ఒక ఏటీఎం వద్ద ఒక వ్యక్తి గంటల తరబడి నిల్చొని ఉన్నాడు. ఎంతకీ కదల్లేదు. మరోపక్క జనాలతో క్యూ పెరిగిపోతుంది. దీంతో ఓపిక నశించిన ఒక వ్యక్తి కోపంతో ఏటీఎం దగ్గరకు వచ్చి నిల్చొన్న వ్యక్తిని చేత్తో తడతాడు. అయినా ఎటువంటి కదలిక లేదు. మరింత అనుమానంతో దగ్గరకు వచ్చి చూస్తాడు. అంతే షాక్.. ఎందుకంటే అది మనిషి కాదు.. ఒక బొమ్మ. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు.

యూకేలోని టెస్కో క్యాష్‌ పాయింట్‌ సమీపంలో ఉన్న ఏటీఎం సెంటర్‌ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షలాది వ్యూస్‌, లైకులు వస్తున్నాయి. నెటిజన్లు కూడా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘అంత టైం వేస్టే చేసే బదులు అసలు అతను ఎందుకు కదల్లేకుండా ఉన్నాడని గమనించలేకపోయారా’, ‘మిమ్మల్ని బాగానే ఫూల్స్‌ చేసిండు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి నెటిజన్లను ఆకట్టుకుంటోన్న ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu