AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహం సింగిల్ గా కాదు.. గుంపుగా వచ్చింది.. భయపడేవాళ్లు ఈ వీడియో చూడొద్దు..

అడవిలో జీవనం చాలా సవాళ్లతో కూడుకున్నది. బతకడం కోసం నిత్యం పోరాటం చేయాల్సిందే. ప్రమాదం ఎక్కడి నుంచి ముందుకొస్తుందోనని సెకన్ సెకనుకు టెన్షన్ టెన్షన్. ఏ మాత్రం అలర్ట్ గా లేకపోయినా ప్రాణాలు...

సింహం సింగిల్ గా కాదు.. గుంపుగా వచ్చింది.. భయపడేవాళ్లు ఈ వీడియో చూడొద్దు..
Lion Hunting
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 02, 2022 | 12:07 PM

అడవిలో జీవనం చాలా సవాళ్లతో కూడుకున్నది. బతకడం కోసం నిత్యం పోరాటం చేయాల్సిందే. ప్రమాదం ఎక్కడి నుంచి ముందుకొస్తుందోనని సెకన్ సెకనుకు టెన్షన్ టెన్షన్. ఏ మాత్రం అలర్ట్ గా లేకపోయినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మన కంటే పెద్ద జంతువులకు ఆహారం అయిపోవాల్సిందే. అడవికి రాజు సింహం. దీనికి ఎలాంటి జంతువునైనా వేటాడే శక్తి ఉంది. ఒక్క గర్జనకు అడవి అంతా వణికిపోతుంది. అడవిలోని అతి పెద్ద జంతువులు కూడా వాటికి దూరంగా ఉండడం మంచిదని భావిస్తుంటాయి. అందుకే ఎదురుగా సింహం కనిపిస్తే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాల్సిందే. లేకపోతే దాని చేతికి చిక్కి ఆహారమైపోవాల్సిందే. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. సింహం గుంపు కలిసి ఓ జంతువును వేటాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మన కంటే పెద్ద వాటిని ఎదురించాలంటే యూనిటీ అవసరమని ఈ వీడియో మనకు సందేశం ఇస్తుంది. సాధారణంగా సింహం ఎక్కడ కనిపించినా అడవిలోని జంతువులన్నీ వేగంగా, దూరంగా పారిపోతాయి. వాటి చేతికి చిక్కి చనిపోవాలని ఏ జంతువూ అనుకోదు. ఎందుకంటే అవి ప్రాణాలు తీసేసేంత క్రూర మృగం. వైరల్ వీడియోలోనూ అలాంటి దృశ్యమే కనిపిస్తోంది.

సింహాల గుంపు కలిసి ఓ గేదెను వేటాడుతుంది. వాటి బారి నుంచి తప్పించుకోవడానికి గేదె ప్రయత్నించినప్పిటికీ అది సాధ్యం కాలేదు. దీంతో అది వాటికి ఆహారంగా మారక తప్పలేదు. వైరల్ అవుతున్న వీడియోలో సింహాల గుంపు గేదెను చూసిన తర్వాత వేటాడేందుకు పరుగెత్తడాన్ని చూడపచ్చు. గేదెను వేటాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి. వాటికి దీటుగా గేదె కూడా రివర్స్ ఎటాక్ చేస్తుంది. కానీ అది ఒంటరిగా ఉండిపోవడం, సింహాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో భారీ మూల్యం తప్పించుకోక తప్పలేదు.

 

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌లో మాసాయి సైటింగ్స్ అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. వార్త రాసే వరకు 61 వేల మందికి పైగా చూశారు. ఈ వీడియో చూసి యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని, సింహాలు ప్రాణాలతో ఉండాలంటే.. మరొకరి ప్రాణాలు తీయాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..