భార్య మాట విన్నాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..
భార్యా భర్తల బంధం చాలా సున్నితమైనది. వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే. ప్రస్తుత కాలంలో భార్య మాటను పెడచెవిన పెట్టే భర్తలూ ఉన్నారు. ఏదైనా తీసుకురమ్మని చెప్పినా, ఇలా చేయండి..
భార్యా భర్తల బంధం చాలా సున్నితమైనది. వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే. ప్రస్తుత కాలంలో భార్య మాటను పెడచెవిన పెట్టే భర్తలూ ఉన్నారు. ఏదైనా తీసుకురమ్మని చెప్పినా, ఇలా చేయండి.. అలా చేయండి అని ఏదైనా సలహా చెప్పినా.. ఆ.. చెప్పావులే అని దీర్ఘం తీస్తారు. కానీ కనీసం అప్పుడప్పుడూ అయినా భార్య మాట వింటే మీకే లాభం అని ఈ సంఘటన నిరూపిస్తోంది. భార్య మాట విన్న ఓ వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలోని మార్క్వేట్ ప్రాంతానికి చెందిన ప్రిస్టోన్ మాకీ అనే వ్యక్తికి ‘మిచిగన్ లాటరీ’లో 190, 736 డాలర్లు అంటే కోటి 5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే, ఆ లాటరీలో డబ్బులు వచ్చేందుకు తన భార్య పంపిన మెసేజే కారణమని చెబుతున్నాడు ఆవ్యక్తి.
‘ నా విధులు ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు కిరాణ సరుకులు తీసుకురావాలని నా భార్య మెసేజ్ చేసింది. దాంతో వచ్చే దారిలో సరుకులు కొనేందుకు షాప్‌కి వెళ్లాను. అక్కడే అమ్ముతున్న లాటరీ టికెట్లను చూసి అనుకోకుండా ఓ 5 లాటరీ టికెట్లు కూడా కొన్నాను. ఆ తర్వాతి రోజు ఉదయం, కిచెన్‌లో ఉన్న సమయంలో లాటరీ టికెట్లను మొబైల్ యాప్‌లో స్కాన్ చేశాను. నేనే జాక్‌పాట్ విన్నర్‌గా తెలుసుకుని ఆశ్చర్యపోయాను. అది ఊహించని పరిణామంలా అనిపించిందని అతను హర్షం వ్యక్తం చేశాడు.
లాటరీలో వచ్చిన నగదుతో కొంత తన పెట్టుబడుల కోసం ఉంచుకుని, మిగిలినది కుటుంబ సభ్యులకు ఇస్తానని చెప్పారు మాకీ. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి సైతం ఈ విధంగానే 15 కోట్ల జాక్‌పాట్ కొట్టినట్లు చెప్పాడు. తాను కిరాణ సరుకుల కోసం వెళ్లి టికెట్ కొనుగోలు చేయటం ద్వారానే లాటరీలో విజేతగా నిలిచానని వెల్లడించాడు.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం..