Viral Video: జీవితమంతా చదువుతూ ఉంటే.. ముసలోడినైపోతా! చదువుకోనని మారం చేస్తున్న బుడతడు

చిన్నప్పుడు స్కూల్‌కు ఎగనామం పెట్టడానికి మనమందరం రకరకాల సాకులు చెప్పి ఉంటాం. ఐతే ఓ చిచ్చర పిడుగు చెప్పిన కారణం వింటే అరె..రె.. ఇది ఎందుకు చెప్పలేదా? అని నాలుక కరచుకుంటాం. స్కూల్‌కు వెళ్లి చదువుకోనని తల్లి దగ్గర మారం చేస్తున్న ఈ బుడతడి వీడియో ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది..

Viral Video: జీవితమంతా చదువుతూ ఉంటే.. ముసలోడినైపోతా! చదువుకోనని మారం చేస్తున్న బుడతడు
Little Boy Protest
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 02, 2022 | 2:07 PM

చిన్నప్పుడు స్కూల్‌కు ఎగనామం పెట్టడానికి మనమందరం రకరకాల సాకులు చెప్పి ఉంటాం. ఐతే ఓ చిచ్చర పిడుగు చెప్పిన కారణం వింటే అరె..రె.. ఇది ఎందుకు చెప్పలేదా? అని నాలుక కరచుకుంటాం. స్కూల్‌కు వెళ్లి చదువుకోనని తల్లి దగ్గర మారం చేస్తున్న ఈ బుడతడి వీడియో ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. మీరే చూడండి ఏం చెబుతున్నాడో..

ఈ వీడియోలో ఓ చిన్నపిల్లవాడు స్టడీ టేబుల్‌ ముందు కూర్చుని ఏడుస్తూ తాను చదువుకోనంటూ తల్లికి చెప్పడం కనిపిస్తుంది. రోజూ ఇలా చదువుకుంటూపోతే తాను ముసలోడినైపోతానంటూ.. పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లికి తన కష్టం చెప్పుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘జీవితాంతం చదువుతూ ఉంటే ముసలోడినైపోతా’ అంటూ ఏడుస్తూ తల్లికి చెబుతాడు. ‘క, ఖ, గ, ఘలు చదివితేనే ముసలాడివవుతావా?’ అంటూ తల్లి ప్రశ్నించగా.. మళ్లీ మళ్లీ అదే సమాధానం చెబుతాడు. ఈ వీడియోకు ఇప్పటికే 5 లక్షలకుపైగా వీక్షణలు, 23,200 లైకులు రావడంతో నెట్టింట వైరల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

బుడ్డోడి తెలివితేటలకు ఫిదా అయిన నెటిజన్లు మాత్రం భిన్న కామెంట్లు చేస్తున్నారు. చెప్పే విధానం నవ్వు తెప్పిస్తోందని కొందరు కామెంట్‌ చేయగా.. మరికొందరు మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ‘ఈ పిల్లాడు చెప్పే విధానం ఫన్నీగా ఉన్నా నిజం చెప్పాడు.. చదువుతూనే మనం వృద్ధులమైపోయం’ అని ఒకరు, ‘పసి పిల్లాడి ఏడుపు హృదయ విదారకంగా ఉంది. పిల్లలపై చదువు భారం మోపిన విద్యా వ్యవస్థలో మార్పు తీసుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉందని’ మరొకరు తమ అభిప్రాయాలను తెలిపారు. మరి మీరేమంటారు..