AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye care: బాదం పప్పు నానబెట్టి ఇలా తిన్నారంటే.. మీ కంటి చూపుకు తిరుగులేదు!

మారుతున్న ఆహార అలవాట్లతోపాటు, జీవనశైలి కారణంగా కంటి చూపులో సమస్యలు తలెత్తుతుంటాయి. మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్.. వంటి డిజిటల్ గాడ్జెట్ల వినియోగం చూపు నాణ్యతను మరింత బలహీనపడుతుంది. ఐతే కొన్ని రకాల ఆహారాలతో..

Eye care: బాదం పప్పు నానబెట్టి ఇలా తిన్నారంటే.. మీ కంటి చూపుకు తిరుగులేదు!
Eye Care Tips
Srilakshmi C
|

Updated on: Oct 02, 2022 | 12:43 PM

Share

మారుతున్న ఆహార అలవాట్లతోపాటు, జీవనశైలి కారణంగా కంటి చూపులో సమస్యలు తలెత్తుతుంటాయి. మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్.. వంటి డిజిటల్ గాడ్జెట్ల వినియోగం చూపు నాణ్యతను మరింత బలహీనపడుతుంది. ఐతే కొన్ని రకాల ఆహారాలతో కంటి చూపును మెరుగుపరచుకోవచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

బాదం

ప్రతి రోజూ ఆహారంలో భాగంగా బాదంపప్పు తీసుకోవడం వల్ల కంటికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చూపును మెరుగుపరచడంతోపాటు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. నానబెట్టిన బాదంపప్పును ప్రతిరోజూ ఉదయం పూట తింటే కళ్ల ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బాదంపప్పును పాలతో కూడా తినవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉసిరి

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచే లక్షణం ఉసిరిలో ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, శక్తివంతమైన పోషకాలు రెటీనా కణాలను రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని చుక్కల ఉసిరి రసాన్ని నీళ్లలో కలుపుకుని రోజుకు రెండుసార్లు తాగవచ్చు. దీనికి తేనె కూడా మిక్స్ చేసి తాగవచ్చు.

విటమిన్ ఎ

ఆహారంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటే.. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విటమిన్ ‘ఎ’లో కంటి సంరక్షణకు అవసరమైన పోషకాలు నిండుగా ఉంటాయి. క్యారెట్, బొప్పాయి, ఉసిరి, ఆకుపచ్చ ఆకు కూరలు, క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్‌

బాదం, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్‌ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిల్లోని పోషకాలు కంటి చూపును మెరుగు పరుస్తాయి. వీటిని నానబెట్టి తింటే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.

ఈ ఆహారాను తీసుకోవడంతోపాటు కళ్లకు సంబంధించిన వ్యాయామాలు కూడా చూపును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. చేతులతో కళ్లను నలపడం చేయకూడదు. దురద లేదా ఇతర ఏదైనా సమస్య ఉంటే, శుభ్రమైన గుడ్డ మీద ఊది, కళ్లకు అద్దడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్లను సంప్రదించడం మరచిపోకూడదు.