Marriage: ‘నా భార్య మహిళ కాదు’.. ఆరేళ్లు కాపురం చేశాక భార్యపై ఫిర్యాదు చేసిన భర్త!

ఓ వ్యక్తి ముచ్చటపడి చేసుకున్న పెళ్లి పెటాకులైంది. ఏకంగా ఆరేళ్లు కాపురం చేశాక తన భార్య అసలు మహిళేకాదని తెలుసుకున్నాడు. దీంతో భార్యపై చీటింగ్‌ కేసు పెట్టి, న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వివరాల్లోకెళ్లే..

Marriage: 'నా భార్య మహిళ కాదు'.. ఆరేళ్లు కాపురం చేశాక భార్యపై ఫిర్యాదు చేసిన భర్త!
Cheating case
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 02, 2022 | 10:12 AM

ఓ వ్యక్తి ముచ్చటపడి చేసుకున్న పెళ్లి పెటాకులైంది. ఏకంగా ఆరేళ్లు కాపురం చేశాక తన భార్య అసలు మహిళేకాదని తెలుసుకున్నాడు. దీంతో భార్యపై చీటింగ్‌ కేసు పెట్టి, న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వివరాల్లోకెళ్లే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన యువకుడికి మురైనాకు చెందిన యువతితో 2016లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఐతే అప్పటి నుంచి వారి మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు. భార్య తీరుపై అనుమానం కలిగిన భర్తకు షాకింగ్‌ విషయం తెలిసింది. వివాహం జరిగిన ఆరేళ్లకు ఈ విషయం విషయం తెలుసుకున్న భర్త తన భార్య మహిళ కాదని, పురుషుడని, తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు సదరు భార్యతోపాటు, ఆమె తండ్రిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

భార్యపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని ఏకంగా హైకోర్టులో పిటీషన్‌ వేశాడు. ఐతే హైకోర్టు ఈ పిటీషన్‌ను తోసిపుచ్చింది. ఐతే పురుషుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు యువతి వాదన మరోలా ఉంది. తనకు హార్మోన్‌ సమస్య ఉండడం వల్లనే ఇలా ఉన్నానని, అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు యువతి తెలిపింది. అయినప్పటికీ అనుమానం తీరని భర్త, తన భార్యకు వైద్య పరీక్షలు చేయించాడు. దీంతో అతని వాదన నిజమేనని తేలింది. తన భార్యగా చెప్పబడుతున్న యువతి మహిళకాదని, పురుషుడని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ కేసును విచారించిన కోర్టు వివాహాన్ని రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!