BPCL Recruitment 2022: రాత పరీక్షలేకుండా భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోనున్న భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

BPCL Recruitment 2022: రాత పరీక్షలేకుండా భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Bharat Petroleum Corporation Limited
Follow us

|

Updated on: Oct 02, 2022 | 9:15 AM

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోనున్న భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. 57 టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైన గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. అక్టోబర్‌ 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. అంటే అక్టోబర్‌ 1, 1995 నుంచి అక్టోబర్ 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్‌ 13, 2022వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల వరకు స్టైపెండ్‌ చెల్లి్స్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • కెమికల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 40
  • మెకానికల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 6
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్ ఖాళీలు: 6
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఖాళీలు: 5

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.