AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC Recruitment 2022: కేంద్ర వాతావరణ శాఖలో 990 సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇంటర్‌ పాసైన వారు అర్హులు..

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భారత వాతావరణ శాఖలోని.. 990 గ్రూప్ 'బి' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

SSC Recruitment 2022: కేంద్ర వాతావరణ శాఖలో 990 సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇంటర్‌ పాసైన వారు అర్హులు..
SSC Scientific Assistant Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Oct 02, 2022 | 8:00 AM

Share

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భారత వాతావరణ శాఖలోని.. 990 గ్రూప్ ‘బి’ నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, భౌతికశాస్త్రం/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు అక్టోబర్‌ 18, 2022వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 18, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ సారి కేవలం టైర్‌-I, టైర్‌-II ద్వారా మాత్రమే అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం: పార్ట్‌ -1, పార్ట్‌ -2లలో మొత్తం 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. 2 గంటల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

పార్ట్‌-1లో..

ఇవి కూడా చదవండి

జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనీంగ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు జనరల్‌ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు క్వాంటిటేవిట్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, కాంప్రహెన్షన్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి.

పార్ట్‌-2లో..

ఫిజిక్స్ / కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 100 మార్కులకు ఉంటుంది. ఈ రెండు విభాగాలకు ఒకేసారి పరీక్ష జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 18, 2022.
  • ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లింపులకు చివరి తేది: అక్టోబర్ 20, 2022.
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు చివరి తేది: అక్టోబర్ 20, 2022.
  • దరఖాస్తులో మార్పులకు చివరి తేదీ: అక్టోబర్ 25, 2022.
  • రాత పరీక్ష తేదీ: డిసెంబర్, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్