- Telugu News Photo Gallery Death Pool in Red Sea: Scientists find a lethal pool that kills anything that swims into it
Death Pool: మృత్యు కొలను! దీనిలోకి ఈతకు వెళ్లిన వాళ్లు ఇంత వరకు తిరిగి రాలేదు..
అటువంటి ఓ విచిత్ర ప్రదేశం గురించి మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు. అదేంటంటే.. ఈ కొలనులో ఈత కెళ్లిన వారెవ్వరూ ఇంత వరకు బతికి బట్టకట్టలేదట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమండీ. దీనిని 'పూల్ ఆఫ్ డెత్' అని పిలుస్తారు. .
Updated on: Oct 01, 2022 | 2:38 PM

ప్రపంచంలో ఎన్నో వింతైన ప్రదేశాలు ఉన్నాయి. ఐతే అవి ఎందుకు అలా ఉన్నాయనే విషయం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అటువంటి ఓ విచిత్ర ప్రదేశం గురించి మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు. అదేంటంటే.. ఈ కొలనులో ఈత కెళ్లిన వారెవ్వరూ ఇంత వరకు బతికి బట్టకట్టలేదట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమండీ. దీనిని 'పూల్ ఆఫ్ డెత్' అని పిలుస్తారు.

ఎర్ర సముద్రం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఉప్పగా ఉండే సముద్రం అని కూడా అంటారు. మియామీ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టుల బృందం ఈ సముద్రంలో దాదాపు 1,770 మీటర్ల లోతులో 'పూల్ ఆఫ్ డెత్' కనుగొన్నారు. ఈ కొలనులోకి ప్రవేశించిన ఏ జీవి కూడా ఇప్పటి వరకు సజీవంగా తిరిగి రాలేదట.

ఈ మృత్యు కొలను సౌదీ అరేబియా తీరానికి 5,800 అడుగుల దూరంలో ఉంది. అంతేకాకుండా దాని పరిసర ప్రాంతం కూడా చాలా దారుణంగా ఉంటుందట. అక్కడికి వెళ్లే ఏ జీవి కూడా బతకదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కొలనులో నీరు తాగినా మృత్యువు తప్పదు. ఈ కొలనులోని నీరు చాలా ప్రమాదకరమైనది.

పరిశోధన ప్రకారం.. ఈ కొలనులో ఆక్సిజన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ఇతర విష రసాయనాలు కూడా ఈ నీటిలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ కొలను నీటిలో సాధారణ సముద్రం నీటి కంటే 7-8 రెట్లు ఉప్పు అధికంగా ఉందని, అందువల్లనే ఏ జీవి దానిలోకి వెళ్లినా, అది మృత్యువాత పడుతుందని వెల్లడైంది.

ఈ కొలను చనిపోయిన ఏ జీవి అయినా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. ఇక్కడి నీరు ఉప్పగా ఉండటం వల్ల ప్రిజర్వేటివ్‌లుగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.





























