Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss season 6: ‘బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నట్టు’

బుల్లి తెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుని ఆరో సీజన్ నిర్వహిస్తోంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ గేమ్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో చెప్పనవసరం లేదు. ఐతే తాజాగా ఈ షోపై కొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు..

Bigg Boss season 6: 'బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నట్టు'
Big Boss 6
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 02, 2022 | 6:32 AM

బుల్లి తెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుని ఆరో సీజన్ నిర్వహిస్తోంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ గేమ్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో చెప్పనవసరం లేదు. ఐతే తాజాగా ఈ షోపై కొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏకంగా ఏపీ హైకోర్టులో పిటీషన్‌ కూడా దాఖలైంది. దీనిపై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. సెన్సార్‌ లేకుండా ప్రసారమవుతున్నాయని బిగ్‌బాస్‌ వంటి రియాల్టీ షోల ద్వారా నిర్వాహకులు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించింది. ఇలాంటి షోలకు అడ్డుకట్ట వేసే విషయంలో చట్టం తెచ్చే ఉద్దేశం అసలుందో? లేదో? చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బిగ్‌బాస్‌ వంటి షోలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్ర హోం, సమాచార ప్రసార, మహిళ శిశు సంక్షేమ శాఖలతోపాటు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఐతే ఇదే తరహాకు సంబంధించి గతంలో దాఖలైన వ్యాజ్యంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ వేయకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 11కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం శుక్రవారం (సెప్టెంబర్‌ 30) తెల్పింది.

కాగా అశ్లీలం, హింసను ప్రోత్సహించేలా ఉన్న బిగ్‌బాస్‌ షోను వెంటనే నిలిపివేయాలంటూ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్‌ వేసిన సంగతి తెలిసిందే. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. జుగుప్సాకరంగా ఉన్న బిగ్‌బాస్‌ వంటి షోల కట్టడికి ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్‌ మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం టీవీల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలపై ఆవేదన వ్యక్తం చేసింది. మంచి సందేశాలు ఇచ్చే కార్యక్రమం ఒక్కటైనా ప్రసారం కావడంలేదని, గతంలో దేశభక్తుల చరిత్రలు ప్రసారమయ్యేవని, గత రోజుల్లో చిత్రీకరించిన సినిమాలు, ఇతర కార్యక్రమాలు మంచి సందేశం ఇచ్చేవని, కుటుంబసభ్యులంతా కలిసి కూర్చుని చూసేలా ఉండేవన్నారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్యక్రమాలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇటువంటి వారికి చరమగీతం పాడాలని, దురదృష్టవశాత్తు విద్యావంతులెవ్వరూ వీటిపై పెదవి విప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.