AP Govt Jobs 2022: ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) యునాని విభాగంలో.. 26 మెడికల్ ఆఫీసర్‌ (యునాని) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..

AP Govt Jobs 2022: ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..
APPSC Medical Officer Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 02, 2022 | 8:19 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) యునాని విభాగంలో.. 26 మెడికల్ ఆఫీసర్‌ (యునాని) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. జులై 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 21, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 6, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.370లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష మొత్తం 2 పేపర్లకు నిర్వహిస్తారు. మొదటి పేపర్‌లో జనవర్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో 150 మార్కులకు, 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 150 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రెండో పేపర్ సంబంధిత సబ్జెక్టులో నిర్వహిస్తారు. ఈ పేపర్‌లో 150 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 300 మార్కులకుగానూ, 150 నిముషాల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఇంగ్లిష్‌ మాద్యమంలో మాత్రమే ఉంటుంది. ఈ విధంగా మొత్తం 450 మార్కులకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. సిలబస్‌, ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.