CSIR-NAL Recruitment 2022: బీటెక్ నిరుద్యోగులకు అలర్ట్! రాత పరీక్షలేకుండా నేషనల్ ఎరోస్పేస్ ల్యాబొరేటరీలో పోస్టులు..
బెంగళూరులోని సీఎస్‌ఐఆర్-నేషనల్ ఎరోస్పేస్ ల్యాబొరేటరీలో.. ఒప్పంద ప్రాతిపదికన 75 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
బెంగళూరులోని సీఎస్‌ఐఆర్-నేషనల్ ఎరోస్పేస్ ల్యాబొరేటరీలో.. ఒప్పంద ప్రాతిపదికన 75 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి మెటీరియల్స్/మెటలర్జీ/ఫిజిక్స్/కెమిస్ట్రీ/సెరామిక్స్/పాలిమర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/ఈఈఈ/ఈసీఈ/ఇన్‌స్రుమెంటేషన్/కంట్రోల్/ఐటీ/కంప్యూటర్ నెట్‌వర్క్ సెక్యురిటీ/ఫ్లైట్ కంట్రోల్/సివిల్/ఏయిరో స్పేస్ తదితర స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 35 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సంబంధిత డాక్యుమెంట్లతో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లి్స్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు.
అడ్రస్: CSIR-NAL (RAB Meeting Complex, National Aerospace Laboratories [NAL], Adjacent to SBI, NAL Branch, Kodihalli, Bengaluru – 560017).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.