TS Inter Board: దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు.. జూనియర్‌ కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక!

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ముందస్తుగానే అన్ని స్కూళ్లకు దసరా సెలవులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఐతే దసరా సెలవుల్లో జూనియర్‌ కాలేజీలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్‌ బోర్డు..

TS Inter Board: దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు.. జూనియర్‌ కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక!
TSBIE
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 02, 2022 | 10:46 AM

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ముందస్తుగానే అన్ని స్కూళ్లకు దసరా సెలవులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఐతే దసరా సెలవుల్లో జూనియర్‌ కాలేజీలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్‌ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఏ జూనియర్‌ కాలేజ్‌ అయినా విద్యార్ధులకు క్లాస్‌లు నిర్వహిస్తే అనుబంధ గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని తెల్పింది. దీనిపై కాలేజీ యాజమాన్యాలు, ప్రిన్సిపాల్‌లపై కూడా చర్యలు తీసుకుంటామని బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌, గురుకుల జూనియర్‌ కాలేజీలకు అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవుల అనంతరం అక్టోబర్‌ 10న కాలేజీలు, స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.