AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stress: ప్రెజర్‌ను తట్టుకోలేకపోతున్నారా..? ఈ చిట్కాలతో ఒత్తిడిని సింపుల్‌గా జయించవచ్చు..

ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కడైనా స్ట్రెస్ అనేది జీవితంలో భాగంగా మారింది.

Stress: ప్రెజర్‌ను తట్టుకోలేకపోతున్నారా..? ఈ చిట్కాలతో ఒత్తిడిని సింపుల్‌గా జయించవచ్చు..
Stress
Shaik Madar Saheb
|

Updated on: Oct 02, 2022 | 12:05 PM

Share

ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కడైనా స్ట్రెస్ అనేది జీవితంలో భాగంగా మారింది. ఈ రోజుల్లో చిన్న విషయానికే కొందరు ఒత్తిడి, టెన్షన్‌తో బాధపడుతున్నారు. అయితే.. ఒత్తిడిని త్వరగా తొలగించుకోకపోతే అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో నిరంతరం ఒత్తిడితో జీవించడం వల్ల హార్ట్ స్ట్రోక్, డిప్రెషన్ వంటి సమస్యలు తొందరగా వస్తాయి. అంతే కాదు ఒత్తిడి వల్ల చర్మం కూడా దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితుల్లో జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. కొన్ని సులభమైన మార్గాలను అవలంబించడం ద్వారా ఒత్తిడి సమస్యను అధిగమించవచ్చు. ఒత్తిడిని ఎలా జయించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ పనులు చేయండి..

వ్యాయామం చేయండి: రోజూ వ్యాయామం చేస్తే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే, మీ శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. దీని కారణంగా మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

స్నేహితులతో మాట్లాడండి: ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్నేహితులతో మాట్లాడటం మంచి మార్గం. ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంటే దానిని నివారించడానికి మీ సన్నిహితులతో మాట్లాడండి. మీకు సమయం ఉంటే వారిని కలవండి. స్నేహితులతో మాట్లాడటం ద్వారా మీ ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఇంకా మీ సమస్యలను వారికి పలు పరిష్కారాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.

సంగీతం వినండి: ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన పాటలు వినండి. మ్యూజిక్ మీకు మనశ్శాంతిని అందించడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచే సంగీతాన్ని తరచూ వినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

జీవనశైలిలో మార్పు: ఒత్తిడి సమస్యను అధిగమించేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ముఖ్యం. మంచి పోషకాహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, పండ్లు తినడం, పాలు తాగడం లాంటివి అలవర్చుకోవాలి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..