AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో మరో యువకుడి ప్రాణం తీసిన లోన్ యాప్.. అప్పు చెల్లించినా వేధించడంతో..

ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్, లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. దీంతో చేసేదేం లేక ఇప్పటికే చాలామంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. లోన్‌ యాప్‌ ఆగడాలకు మరో ప్రాణం బలైంది.

Andhra Pradesh: ఏపీలో మరో యువకుడి ప్రాణం తీసిన లోన్ యాప్.. అప్పు చెల్లించినా వేధించడంతో..
Loan App Harassment
Shaik Madar Saheb
|

Updated on: Oct 02, 2022 | 11:41 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్, లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. దీంతో చేసేదేం లేక ఇప్పటికే చాలామంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. లోన్‌ యాప్‌ ఆగడాలకు మరో ప్రాణం బలైంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో లోన్‌యాప్‌ అరాచకానికి యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ధవళేశ్వరం సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్.. పలు లోన్‌యాప్‌ల నుంచి రుణాలు తీసుకున్నాడు. అనంతరం లోన్‌లన్నింటినీ చెల్లిస్తూ వచ్చాడు. అయితే.. లోన్‌ చెల్లించినప్పటికీ.. ఇంకా కట్టాలంటూ లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు పెరిగాయి. తీసుకున్న అప్పు చెల్లించినా వేధింపులు ఆగకపోవడంతో.. శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్‌యాప్‌ వేధింపులు తట్టుకోలేక ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లోన్‌ యాప్‌కు డబ్బులు కట్టేసినా శ్రీనివాస్‌ను వేధింపులకు గురి చేశారని.. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ మంగాదేవి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.

కాగా.. ఏపీలో లోన్ యాప్ ఆగడాలు పెరుగుతున్నాయి. వేలల్లో రుణాలు ఇచ్చి.. లక్షల్లో వసూలు చేస్తున్న ఘటనలు సైతం వెలుగులోకి వచ్చాయి. అధికంగా వడ్డీలు విధిస్తూ మొత్తం కట్టాల్సిందేనని, లేదంటే న్యూడ్ వీడియోలు పెడతామని బెదిరిస్తుండటంతో చాలామంది గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం లోన్‌ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం కూడా తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని లోన్‌ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీచేసింది. అయినప్పటికీ.. లోన్‌ యాప్స్‌ వేధింపులు పెరిగిపోతుండటం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..