Crime News: కూరలో ఉప్పు తక్కువైందని భర్త దారుణం.. ఏకంగా కట్టుకున్న భార్యను..

దేశంలో దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు దుర్మార్గులు క్షణికావేశంలో సొంతవారినే కడతేరుస్తున్నారు. ఓ భర్త కూరలో ఉప్పు తక్కువైందని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు.

Crime News: కూరలో ఉప్పు తక్కువైందని భర్త దారుణం.. ఏకంగా కట్టుకున్న భార్యను..
Curry
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 02, 2022 | 8:28 AM

దేశంలో దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు దుర్మార్గులు క్షణికావేశంలో సొంతవారినే కడతేరుస్తున్నారు. ఓ భర్త కూరలో ఉప్పు తక్కువైందని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని సారన్‌ జిల్లాలో వెలుగుచూసింది. కూరలో ఉప్పు తక్కువగా ఉందని భార్య (50) పై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన సరన్ జిల్లాలోని మాంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలాన్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాంఝీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం భార్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హంతకుడైన భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలాన్‌ గ్రామానికి చెందిన ప్రభురాం భార్య శుక్రవారం రాత్రి వంట చేసింది. పొరపాటున కూరలో ఉప్పు కొద్దిగా తక్కువగా వేడయంతో భార్యపై ప్రభురామ్ కోపంతో రగిలిపోయాడు. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మరింత కోపంతో ఊగిపోయిన ప్రభురామ్ ఆమెను కత్తితో దారుణంగా హత్య చేశాడు.

అయితే.. ప్రభురామ్ తాటిచెట్టు నుంచి కల్లు తీసి అమ్ముతాడని పోలీసులు తెలిపారు. కల్లు గీసే ఆయుధంతోనే నిందితుడు భార్యను నరికి చంపినట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!