King Cobra: వాయమ్మో.. అదే కావాల్సి వచ్చిందా..? ఇన్నర్ వేర్ మింగి నాగుపాము అష్టకష్టాలు.. చివరికి ఏమైందంటే?

ఏ పాము కూడా దుస్తులను ఆహారంగా తీసుకోదు. ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు కూడా లేవు. అయితే తాజాగా ఓ నాగుపాము ఇన్నర్‌ వేర్‌ను మింగేసింది.

King Cobra: వాయమ్మో.. అదే కావాల్సి వచ్చిందా..? ఇన్నర్ వేర్ మింగి నాగుపాము అష్టకష్టాలు.. చివరికి ఏమైందంటే?
King Cobra
Follow us

|

Updated on: Oct 02, 2022 | 8:17 AM

ఈ భూమ్మీద సుమారు 2వేల జాతులకు పైగా పాములున్నాయని అంచనా. వాటిలో చాలావరకు విషంతో నిండినవే. కొన్ని పాములు మాత్రమే మనుషులకు ఎలాంటి హాని కలిగించవు. అయితే సర్పాలన్నీ చాలావరకు మాంసాహారులే. కప్పలు, ఎలుకలు, గుడ్లు, పక్షులను ఆహారంగా తీసుకుంటాయి పాములు. అలాగే బల్లులు, సాలమండర్లను కూడా కొన్ని జాతుల పాములు తింటుంటాయి. అయితే ఏ పాము కూడా దుస్తులను ఆహారంగా తీసుకోదు. ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు కూడా లేవు. అయితే తాజాగా ఓ నాగుపాము ఇన్నర్‌ వేర్‌ను మింగింది. కక్కలేక, మింగలేక అష్టకష్టాలు పడింది. కర్ణాటకలో ఈ సంఘటన జరగ్గా.. దీనికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని చామరాజనగర్ తాలూకా కోటతిట్టు గ్రామానికి చెందిన శివకుమార్ ఇంట్లోకి ఓ భారీ నాగుపాము దూరించి. అదే సమయంలో ఇంటి ఆవరణలో ఆరేసిన అండర్‌వేర్‌ను చూసి ఎలుక అని అది పొరబడిందేమో. అండర్‌వేర్‌ను అమాంతం మింగేసింది. దీంతో అది పడరాని పాట్లు పడింది. ఇళ్లు పైకి ఎక్కి మరీ తంటాలు పడింది. పామును గమనించిన ఇంటిసభ్యులు దానిని చంపేందుకు ప్రయత్నించారు. అయితే శివకుమార్‌ వారిని అడ్డుకుని స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు.

ఇవి కూడా చదవండి

ఇంకేం దొరకలేదా?

శివకుమార్ ఇంటికి చేరుకున్న స్నేక్ క్యాచర్‌ ఇంటి పైకి ఎక్కి నాగుపామును పట్టుకున్నాడు. ఆ తర్వాత కిందకు తీసుకొచ్చాడు. తోక పట్టుకుని ఉండగా.. పాము తన నోటి నుంచి ఇన్నర్‌ వేర్‌ను కొద్దికొద్దిగా బయటికి కక్కింది. చాలా సేపటికి కానీ ఇన్నర్‌ వేర్‌ బయటకు రాలేదు. ఆతర్వాత పాము పారిపోవడానికి ప్రయత్నించగా.. స్నేక్ క్యాచర్‌ దానిని బంధించాడు. ఆపై ఊరికి దూరంగా తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇదేం పామురా అయ్యా.. దీనికి ఇంకేం దొరకలేదా’, అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..