AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాబేలుతో మామూలుగా ఉండదు.. మొసలికే ముచ్చెమటలు పట్టించేసింది..

ప్రకృతి ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. కనిపించినంత అందగా అందులో నివసించే జంతువులకు ఉండదు. జీవనం కోసం నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. బతుకు కోసం నిత్యం పోరాటమే. నీటిలో..

తాబేలుతో మామూలుగా ఉండదు.. మొసలికే ముచ్చెమటలు పట్టించేసింది..
Crocodile Video
Ganesh Mudavath
|

Updated on: Oct 02, 2022 | 8:26 AM

Share

ప్రకృతి ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. కనిపించినంత అందగా అందులో నివసించే జంతువులకు ఉండదు. జీవనం కోసం నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. బతుకు కోసం నిత్యం పోరాటమే. నీటిలో ప్రమాదకరమైన జంతువు ఏదైనా ఉందంటే.. అది మొసలి అనే చెప్పాలి. నీళ్లల్లో ఉన్నప్పుడు దానికి చాలా శక్తి ఉంటుంది. తన కంటే పెద్ద జంతువునైనా ఇట్టే అవలీలగా పట్టేసి స్వాహా చేసేస్తుంది. మనిషిని సైతం మింగేసే సామర్థ్యం దానికి ఉంది. మరోవైపు.. తాబేలు కూడా ఏ మాత్రం తీసిపోదు. వేటాడుకున్నప్పటికీ అది ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగలదు. ఇక మొసలి, తాబేలు రెండూ నీటిలోనే ఉంటాయి కాబట్టి తాబేలు మొసలికి ఆహారంగా మారడం కామన్. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. అంతే కాకుండా వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈ వీడియో మాత్రం అది తప్పని నిరూపిస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. తాబేలు చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో తాబేలు ఒడ్డున ఉన్న సమయంలో మొసలి సడెన్ గా ఎటాక్ చేస్తుంది. నోటితో పెట్టుకుని మింగేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మొసలికి సాధ్యం కాలేదు. తాబేలుపై ఉండే షెల్ కారణంగా మొసలికి తినలేకపోయింది. ఇలా చాలా సార్లు ప్రయత్నించి విఫలమవుతుంది. దీంతో మొసలి తాబేలును వదిలేస్తుంది. చావు నుంచి బయటపడిన తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ కు ఇప్పటి వరకు వ్యూస్, లైక్స్ భారీగా వస్తున్నాయి. అంతే కాకుండా తమదైన స్టైల్ లో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే తాబేలులా ఉండాలి.’ అని తమ అభిప్రాయాలను రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..