Telangana: మితిమీరిన కొడుకు ఆగడాలు.. మరో కొడుకుతో కలిసి కఠిన నిర్ణయం తీసుకున్న తల్లి.. చివరకు

అన్నంలో విషం పెట్టిన కొడుకును చంపిన విజయనగరం ఘటన మరువక ముందే.. తెలంగాణలో అలాంటి మరో దారుణం వెలుగు చూసింది. మద్యానికి బానిసై కొడుకు వేధింపులు తాళలేక..

Telangana: మితిమీరిన కొడుకు ఆగడాలు.. మరో కొడుకుతో కలిసి కఠిన నిర్ణయం తీసుకున్న తల్లి.. చివరకు
Mother Kills Son
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 01, 2022 | 8:40 PM

అన్నంలో విషం పెట్టిన కొడుకును చంపిన విజయనగరం ఘటన మరువక ముందే.. తెలంగాణలో అలాంటి మరో దారుణం వెలుగు చూసింది. మద్యానికి బానిసై కొడుకు వేధింపులు తాళలేక.. కుటుంబ సభ్యులంతా కలిసి అతన్ని చంపేశారు. ఈ దారున ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హవేలి ఘన్‌పురం మండలంలోని నాగపూర్‌ గ్రామంలో దేవేందర్‌ అర్ధాంతర మరణం విషాదాన్ని నింపింది. భూమ్మ- సంగయ్య దంపతుల ఇద్దరు కుమారుల్లో దేవేందర్‌ పెద్దవాడు. పెళ్లి కూడా చేశారు. కొడుకు బాగుండాలని కన్నవాళ్లు ఎంతో కష్టపడ్డారు. కానీ చెడు సవాసాలతో దేవేందర్‌ మద్యానికి బానిసయ్యాడు. టార్చర్‌ భరించలేక భార్య విడాకులు తీసుకుంది. దేవేందర్‌ ఇక డే అండ్‌ నైట్‌ తాగుడే తాగుడు. డబ్బు కోసం కన్నవాళ్లను వేధించేవాడు. తాగిన మైకంలో ఊళ్లో గొడవపడ్డం. వాళ్లు ఇంటికి వచ్చి ఫిర్యాదు చేయడం..పైగా తాగుడు కోసం దొంగతనాలకు పాల్పుడుతున్నాడనే ఆరోపణలు రావడం.. వెరసి దేవేందర్‌ వైఖరిపై ఇంటిల్లిపాది విసిగివేసారారు.

దేవేందర్‌ మరో వ్యక్తితో కలిసి ఓ దుకాణంలో చోరీ చేశాడని పంచాయితీ పెట్టి జరిమానా విధించారు. తను చెడ్డ కోతి వనమెల్ల చెరిచినట్టు తమ పరువు తీస్తున్నాడని భావించారు కుటుంబసభ్యులు. ఇలాంటోడు ఉంటేనేం చస్తేనేం అనేంతగా వాళ్లు మనస్థాపం చెందారు. ఆ క్రమంలో చిన్నకొడుకుతో కలిసి అమ్మ కఠిన నిర్ణయం తీసుకుంది. దేవేందర్‌ను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని సీన్‌ క్రియేట్‌ చేశారు. ఊళ్లో వాళ్లు నిజమేననుకున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. దేవేందర్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?అనే పాయింట్‌పై కొందరి అనుమానాలు రావడంతో నిప్పులాంటి నిజం వెలుగులోకి వచ్చింది. ఆనోటా ఈనోటా మ్యాటర్‌ పోలీసులకు చేరింది.

ఔను.. అమ్మ, తమ్ముడు కలిసి దేవేందర్‌ను చంపేశారు. కారణం ఏదైనా నేరం నేరమే కదా. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అంతేకాదు దేవందర్‌ హత్యోదంతాన్ని బయటకు రాకుండా ఊళ్లో పంచాయతీ, జరిమానాతో సెటిల్‌ చేయబోయిన పెద్ద మనుషులపై కూడా కేసు పుటప్‌ అయింది. వాళ్లపై కూడా చర్యలు తప్పవన్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..